
T20 World Cup 2024 Opening Ceremony: 9వ టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. తొలిరోజు 2 మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో అమెరికా జట్టు కెనడా జట్టుతో తలపడగా, రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు పపువా న్యూ గినియా జట్టుతో తలపడనుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించనున్న ఈ టోర్నీలో టైటిల్ కోసం 20 జట్లు పోటీపడనున్నాయి. అన్ని జట్లను 5 చొప్పున 4 గ్రూపులుగా విభజించారు. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు, ఓపెనింగ్ వేడుక నిర్వహించనున్నారు. ఈ వేడుకలో చాలా మంది ప్రముఖులు సందడి చేయనున్నారు.
2024 టీ20 ప్రపంచ కప్ ప్రారంభ వేడుక టెక్సాస్‌లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో జరగనుంది. ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఈ వేడుకలు మొదలుకానున్నాయి. భారతదేశంలో ప్రారంభ వేడుకలు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అంతేకాకుండా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చు. ట్రినిడాడియన్ గాయకులు డేవిడ్ రడ్డర్, రవి బి, స్వరకర్త, గీత రచయిత ఇర్ఫాన్ అల్వెస్, గాయకుడు డీజీ అనా, అల్ట్రా సిమ్మో ప్రారంభ వేడుకలో ప్రదర్శన ఇవ్వనున్నారు.
ఈ టీ20 ప్రపంచకప్‌లో 20 జట్లు పాల్గొంటున్నాయి. వీటిలో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, కెనడా, ఇంగ్లాండ్, ఇండియా, ఐర్లాండ్, నమీబియా, నేపాల్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఒమన్, పాకిస్థాన్, పాపువా న్యూ గినియా, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఉగాండా, అమెరికా, వెస్టిండీస్ ఉన్నాయి.
T20 ప్రపంచ కప్ 2024: T20 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న 9 స్టేడియాలు
గ్రూప్ A: ఇండియా, పాకిస్థాన్, USA, ఐర్లాండ్, కెనడా.
గ్రూప్ బి: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్.
గ్రూప్ సి: వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, పాపువా న్యూ గినియా.
గ్రూప్ డి: దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్.
2024 T20 WORLD CUP OPENING CEREMONY ON 2ND JUNE…!!! 🏆 pic.twitter.com/ZPVCkw8kwi
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 31, 2024
గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు అమెరికాలోని న్యూయార్క్, డల్లాస్, లాడర్‌హిల్ (ఫ్లోరిడా)లలో జరుగుతాయి. మరికొన్ని గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు, సూపర్-8, సెమీ-ఫైనల్స్, ఫైనల్స్ వెస్టిండీస్‌లోని బ్రిడ్జ్‌టౌన్, ప్రొవిడెన్స్, నార్త్ సౌండ్, గ్రాస్ ఐలెట్, కింగ్‌స్టన్, తరోబాలో జరుగుతాయి. ఫైనల్ బ్రిడ్జ్‌టౌన్ (బార్బడోస్)లో జరుగుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..