IND vs ENG: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్‌ సెమీస్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? ఫుల్ వెదర్ రిపోర్టు ఇదిగో

|

Jun 27, 2024 | 2:47 PM

IND vs ENG, T20 World Cup 2024: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచ కప్‌ 2వ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి . గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా గురువారం (జూన్ 27) రాత్రి 8 గంటలరే ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది అయితే ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది

IND vs ENG: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్‌ సెమీస్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? ఫుల్ వెదర్ రిపోర్టు ఇదిగో
IND vs ENG, T20 World Cup 2024
Follow us on

IND vs ENG, T20 World Cup 2024: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచ కప్‌ 2వ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి . గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా గురువారం (జూన్ 27) రాత్రి 8 గంటలరే ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది అయితే ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం అంతరాయం కలిగిస్తుందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. అక్యూవెదర్ నివేదిక ప్రకారం జూన్ 27న గయానాలో పలు మార్లు వర్షం కురిసే అవకాశముంది. మ్యాచ్ ప్రారంభానికి అరగంట ముందు అంటే స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు వర్షం పడే అవకాశం 66 శాతం ఉంది. ఆ తర్వాత కూడా మేఘావృతమైన వాతావరణం కొనసాగుతుందని, ఉదయం 11 గంటల తర్వాత వర్షం కురిసే అవకాశం 75 శాతం ఉంటుందని సమాచారం.12 గంటల తర్వాత వర్షం తగ్గుముఖం పట్టినా 49 శాతం ఉంటుంది. తదుపరి మూడు గంటల పాటు, అంటే స్థానిక సమయం మధ్యాహ్నం 3 గంటల వరకు (12:30 AM IST), మేఘావృతమైన వాతావరణం కొనసాగుతుంది. మొత్తానికి 35-40 శాతం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం.

కాబట్టి భారత్, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ అనుకున్న సమయానికి పూర్తవ్వదని తెలుస్తోంది. అదనపు సమయాన్ని వినియోగించుకున్నా వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఎందుకంటే గయానా కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల మధ్య 50% వర్షం కురుస్తుంది. రాత్రి 7 గంటల నుండి వర్షం మొత్తం 20% నుండి 30% వరకు తగ్గుతుందని అక్యూవెదర్ నివేదిక పేర్కొంది. అంటే ఇక్కడ నిరంతరాయంగా వర్షాలు కురిస్తే గ్రౌండ్ తడిసిపోవడం ఖాయం. కాబట్టి భారత్, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరుగుతుందా అనేది ప్రశ్న.

ఇవి కూడా చదవండి

రిజర్వ్ డే లేదు:

భారత్, ఇంగ్లండ్ సెమీస్ మ్యాచ్ కు రిజర్వ్ డే లేదు. బదులుగా వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగితే అదనంగా 250 నిమిషాలు వినియోగిస్తారు భారత్-ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. టీమ్ ఇండియా ఫైనల్లోకి అడుగుపెట్టనుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం వర్షం కారణంగా నాకౌట్‌ మ్యాచ్‌లు రద్దైతే గ్రూప్‌ స్టేజ్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు తదుపరి దశకు చేరుకుంటుంది.ఇక్కడ గ్రూప్-1 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టీమ్ ఇండియా ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. కాబట్టి వర్షం కురిసినా భారత జట్టుకు ఎలాంటి ఆందోళన లేదనే చెప్పాలి.

మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
ఉదయం 10.30 గంటలకు భారత్, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. అంటే భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. షెడ్యూల్ ప్రకారం రాత్రి 11.30 (IST)లోపు మ్యాచ్‌ను నిర్వహించలేకపోతే, అదనంగా 4 గంటల 16 నిమిషాలు ఉపయోగిస్తారు. ఈ వ్యవధిలోపు మ్యాచ్ నిర్వహించలేకపోతే మాత్రమే మ్యాచ్ రద్దు చేస్తారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..