Pakistan Team: ‘ఇది జట్టు కాదు.. నిప్పుల కుంపటి’ పాక్ జట్టుపై కోచ్ షాకింగ్ స్టేట్‌మెంట్
Gary Kirsten on Pakistan Team: టీ20 ప్రపంచ కప్ 2024 పాకిస్తాన్‌కు చాలా చెడ్డదిగా మారింది. టోర్నీ ఆరంభం నుంచి జట్టు ప్రదర్శన యావరేజ్‌గా ఉంది. టోర్నీలో పాకిస్థాన్ గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. పాక్ ఓటమి తర్వాత జట్టుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పలువురు మాజీ ఆటగాళ్లు జట్టు కెప్టెన్ బాబర్ ఆజంతో పాటు ఇతర ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Gary Kirsten on Pakistan Team: టీ20 ప్రపంచ కప్ 2024 పాకిస్తాన్‌కు చాలా చెడ్డదిగా మారింది. టోర్నీ ఆరంభం నుంచి జట్టు ప్రదర్శన యావరేజ్‌గా ఉంది. టోర్నీలో పాకిస్థాన్ గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. పాక్ ఓటమి తర్వాత జట్టుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పలువురు మాజీ ఆటగాళ్లు జట్టు కెప్టెన్ బాబర్ ఆజంతో పాటు ఇతర ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వీటన్నింటితో పాటు పాకిస్థాన్ ప్రధాన కోచ్ గ్యారీ కిర్‌స్టన్ షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. టీ20 ప్రపంచకప్‌లో అవమానకరమైన ప్రదర్శన తర్వాత, గ్యారీ కిర్‌స్టన్ కీలక ప్రకటన చేశాడు. పాకిస్తాన్ జట్టులో ఐక్యత లేదంటూ చెప్పుకొచ్చాడు.
గ్యారీ కిర్‌స్టన్ షాకింగ్ స్టేట్‌మెంట్..
పాకిస్తాన్ టీవీ న్యూస్ ఛానెల్ జియో న్యూస్‌కి చెందిన జర్నలిస్ట్ ఇహ్తిషామ్ ఉల్ హక్ ప్రకారం, గ్యారీ కిర్‌స్టన్ పాకిస్తాన్ క్రికెట్ జట్టు గురించి మాట్లాడుతూ, ‘పాకిస్తాన్ జట్టులో ఐక్యత లేదు. వాళ్లంతా దీనిని జట్టు అని పిలుస్తున్నారు. కానీ, ఇది జట్టు కాదు. వారు ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోరు. పూర్తి భిన్నంగా ఉంటుంటారు. నేను చాలా టీమ్‌లతో పనిచేశాను. కానీ, ఇలాంటి పరిస్థితి ఎక్కడా చూడలేదంటూ’ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని గ్యారీ కిర్‌స్టన్ ఈ ప్రకటన చేశారు. అతని ప్రకటన పాక్ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టించింది. టీమ్‌లో అంతా సవ్యంగా సాగడం లేదన్న విషయం కూడా కోచ్ ప్రకటనతో తేలిపోయింది. వాస్తవానికి, టీ20 ప్రపంచ కప్ 2024 ప్రారంభానికి ముందు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గ్యారీ కిర్‌స్టన్‌ను జట్టు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు ప్రధాన కోచ్‌గా నియమించింది. పాకిస్తాన్ కోచ్‌గా మొదటి మేజర్ టోర్నమెంట్ తర్వాత కూడా, కిర్‌స్టన్ తన ప్రకటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది.
పాకిస్థాన్ జట్టుపై ఇలాంటి ప్రకటన చేసిన మొదటి వ్యక్తి గ్యారీ కిర్‌స్టన్ మాత్రమే కాదండోయ్.. అతని కంటే ముందు మహ్మద్ హఫీజ్, ఇంజమామ్ ఉల్ హక్ వంటి వెటరన్ ఆటగాళ్లు కూడా జట్టు ఐక్యతపై ప్రశ్నలు సంధించారు. ప్రపంచ కప్‌లో గ్రూప్ దశలో, ఐర్లాండ్, కెనడా వంటి బలహీన జట్లపై పాకిస్తాన్ కేవలం 2 మ్యాచ్‌లను మాత్రమే గెలిచింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో కూడా పాకిస్థాన్ గెలవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..