SMAT: వామ్మో.. ఈ విచిత్రం ఎక్కడా చూడలే.. ఏకంగా 11 మందితో.. టీ20ల్లో అరుదైన రికార్డ్

Delhi vs Manipur: ముంబైలోని వాంఖడే స్టేడియంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు అద్వితీయ ప్రపంచ రికార్డు సృష్టించింది. మణిపూర్‌పై ఢిల్లీ మొత్తం 11 మంది ఆటగాళ్లతో బౌలింగ్ చేయింది.

SMAT: వామ్మో.. ఈ విచిత్రం ఎక్కడా చూడలే.. ఏకంగా 11 మందితో.. టీ20ల్లో అరుదైన రికార్డ్
Delhi Vs Manipur
Follow us
Venkata Chari

|

Updated on: Nov 29, 2024 | 4:51 PM

Delhi vs Manipur: టీ20 క్రికెట్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో ప్రపంచ రికార్డులు సృష్టించడం, ఆ తర్వాత బద్దలు కావడం తరచుగా చూస్తూనే ఉన్నాం. కానీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీ జట్టు 11 మంది ఆటగాళ్లతో బౌలింగ్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. మణిపూర్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు మొత్తం 11 మంది ఆటగాళ్లను బౌలింగ్ చేయించడం విశేషం. టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఇంతకుముందు టీ20లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 9 మంది బౌలర్లను ఉపయోగించింది.

మొత్తం 11 మంది ఆటగాళ్లు బౌలింగ్ చేశారుగా..

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన మణిపూర్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభం నుంచే ఇబ్బందులు పడింది. ఓపెనర్ కంగ్‌బామ్ ప్రియోజిత్ సింగ్ 0 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత, ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బధోని ఒక వ్యూహాన్ని అనుసరించాడు. ఇది నిజంగా ఆశ్చర్యకరమైనది. అతను తన జట్టులోని ఆటగాళ్లందరినీ బౌలింగ్ చేయించాడు. ఆయుష్ సింగ్ తోపాటు అఖిల్ చౌదరి, హర్ష్ త్యాగి, దిగ్వేష్ రాఠి, మయాంక్ రావత్ బౌలింగ్ చేశారు. ఆ తర్వాత, ఆయుష్ బధోని వికెట్ కీపింగ్‌ను వదిలి స్వయంగా బౌలింగ్‌కు వచ్చాడు. వీరితో పాటు ఆర్యన్ రాణా, హిమ్మత్ సింగ్, ప్రియాంష్ ఆర్య, యశ్ ధుల్, అనుజ్ రావత్ కూడా బౌలింగ్ చేశారు.

మణిపూర్ 120కే పరిమితం..

ఢిల్లీ జట్టులోని మొత్తం 11 మంది ఆటగాళ్లు బౌలింగ్ చేసినప్పటికీ మణిపూర్ జట్టు 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ తరపున దిగ్వేష్ రాఠీ 8 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. వికెట్ కీపర్ హర్ష్ త్యాగికి 2 వికెట్లు, కెప్టెన్ ఆయుష్ బధోనీకి ఒక వికెట్ దక్కింది. ఒకానొక సమయంలో మణిపూర్ 41 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా చివరికి రెక్స్ సింగ్ 23 పరుగులు, అహ్మద్ షా 32 పరుగులు చేయడంతో ఆ జట్టు 120 పరుగులకు చేరుకుంది.

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయం..

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు గెలిచింది. కానీ, మణిపూర్ పరిస్థితి మరింత దిగజారింది. కేవలం 9 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ విజయం సాధించింది. ఈ క్రమంలో 6 వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ తరఫున యశ్ ధుల్ మాత్రమే అజేయంగా 59 పరుగులు చేశాడు. మిగతా ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లు ఇబ్బంది పడ్డారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..