AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suryakumar Yadav: బిగ్ షాక్.. ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్‌బై? ఇవిగోండి ప్రూఫ్స్

టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్‌ను వీడనున్నాడనే ప్రచారం జోరందుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రాంచైజీని అన్‌ఫాలో చేయడం, పాత పోస్టులను తొలగించడం ఊహాగానాలకు కారణమైంది. అయితే దీనిపై సూర్యకుమార్ లేదా ముంబై ఇండియన్స్యా జమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Suryakumar Yadav: బిగ్ షాక్.. ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్‌బై? ఇవిగోండి ప్రూఫ్స్
Mumbai Indians
SN Pasha
|

Updated on: Jun 08, 2026 | 11:40 AM

Share

టీమిండియా టీ20 కెప్టెన్సీతో పాటు జట్టులో స్థానం కోల్పోయి సూర్యకుమార్ యాదవ్ గురించి మరో షాకింగ్ విషయం తెలియవస్తుంది. అదేంటంటే.. సూర్య ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ టీమ్‌తో తెగదెంపులు చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల పూర్ ఫామ్ కారణంగా భారత టీ20 జట్టు కెప్టెన్సీ కోల్పోవడమే కాకుండా ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లకు కూడా ఎంపిక కాకపోవడంతో సూర్యకుమార్ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. సెలెక్టర్లు జట్టు భవిష్యత్తు దృష్ట్యా యంగ్ ప్లేయర్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో సూర్య రీఎంట్రీ సవాల్‌గా మారింది.

ఇదిలా ఉండగా ఇప్పుడు అతని ఐపీఎల్ భవిష్యత్తుపై కూడా చర్చ మొదలైంది. గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సూర్యకుమార్ కేవలం 270 పరుగులకే పరిమితమయ్యాడు. అదే సమయంలో జట్టు కూడా ఫేలవ ప్రదర్శన చేయడంతో వచ్చే సీజన్‌కు ముందు ఫ్రాంచైజీ భారీ మార్పులకు సిద్ధమవుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ చేసిన సోషల్ మీడియా చర్యలు కొత్త ఊహాగానాలకు దారితీశాయి. ముంబై ఇండియన్స్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను అతడు అన్‌ఫాలో చేసినట్లు, ఫ్రాంచైజీకి సంబంధించిన అనేక పోస్టులను తన ఖాతా నుంచి తొలగించినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి.

ప్రస్తుతం సూర్య ప్రొఫైల్‌లో ముంబై ఇండియన్స్‌కు సంబంధించిన ఫొటోలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యాను కూడా అతడు ఫాలో కావడం లేదని సమాచారం. అయితే ఇప్పటివరకు సూర్యకుమార్ యాదవ్ గానీ, ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ గానీ ఈ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అందువల్ల అతడు నిజంగానే జట్టును వీడనున్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us