AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: నాకు మంత్రాలు రావు బ్రో.. అసలు నిమ్మకాయ తీసుకెళ్లింది అందుకే..!

SRH vs CSK Viral Video: మంత్రాలకు చింతకాయలే రాలవు.. కానీ వికెట్లు రాల్తాయా.. ఓ నిమ్మకాయ పట్టుకుని ఓం భీం బుష్ అంటూ మంత్రాలు చదివితే ప్రత్యర్థి జట్టు వికెట్ టప్పున పడుతుందా.. ఏప్రిల్ 18న జరిగిన SRH-CSK మ్యాచ్‌లో జరిగిన సీన్ చూసి.. తొలుత అంతా షాక్ అయ్యారు. ఈక్రమంలో అసలు ఆ వీడియోలో ఉన్న వ్యక్తి నిమ్మకాయతో ఏం చేశాడనేది పూర్తిగా తెలుసుకుందాం..

Video: నాకు మంత్రాలు రావు బ్రో.. అసలు నిమ్మకాయ తీసుకెళ్లింది అందుకే..!
Ipl 2026 Srh Vs Csk Lemon Viral Video
Venkata Chari
|

Updated on: Apr 20, 2026 | 4:40 PM

Share

మంత్రాలకు చింతకాయలు రాలతాయో లేదో తెలీదు కానీ, వికెట్లు మాత్రం రాల్తాయని సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. నిమ్మకాయ చేత పట్టుకుని ఏదో మంత్రం చదువుతుండగా వికెట్ పడిపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, ఈ ‘బ్లాక్ మ్యాజిక్’ వెనుక ఉన్న అసలు నిజాన్ని సన్నీ బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

సోషల్ మీడియాను ఊపేస్తున్న నిమ్మకాయ వీడియో..

ఐపీఎల్ 2026లో భాగంగా ఏప్రిల్ 18న జరిగిన హైదరాబాద్ వర్సెస్ చెన్నై జట్ల మధ్య పోరులో ఒక ఆసక్తికర దృశ్యం కెమెరాకు చిక్కింది. గ్యాలరీలో కూర్చున్న సన్నీ అనే వ్యక్తి చేతిలో నిమ్మకాయ పట్టుకుని ఏదో మంత్రాలు చదువుతున్నట్లుగా కనిపించాడు. చిత్రంగా అదే సమయంలో క్రీజులో ఉన్న చెన్నై బ్యాటర్ శివం దుబే అవుట్ అయ్యాడు. దీంతో సన్నీ స్టేడియంలో క్షుద్ర పూజలు చేశాడంటూ వార్తలు వెల్లువెత్తాయి. ఈ వీడియో లక్షలాది వీక్షణలతో జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది.

వైరల్ లేఖ వెనుక అసలు నిజం..

ఈ ఘటనపై చెన్నై జట్టు యాజమాన్యం భారత క్రికెట్ నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసినట్లు ఒక లేఖ ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. అయితే, ఈ లేఖపై జరిపిన విచారణలో అది పూర్తిగా నకిలీదని తేలింది. ఆ లేఖలో చెన్నై జట్టు అధికారిక పేరును కూడా తప్పుగా రాశారు. అటువంటి ఫిర్యాదు ఏదీ అందలేదని క్రికెట్ బోర్డు వర్గాలు ధృవీకరించాయి. కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఎవరో ఆ లేఖను సృష్టించినట్లు స్పష్టమైంది.

టీవీ9 ఆరా.. సన్నీ ఏమన్నాడంటే?

అసలు స్టేడియంలోకి నిమ్మకాయను పోలీసులు ఎలా అనుమతించారు? సన్నీ నిజంగానే మంత్రాలు చదివాడా? అన్న విషయాలపై టీవీ9 ఆరా తీసింది. దీనిపై సన్నీ స్పందిస్తూ.. “నాకు ఎటువంటి మంత్రాలు రావు. స్టేడియంలో ఉక్కపోతగా ఉండటంతో వాంతులు కాకుండా ఉండేందుకు నిమ్మకాయను వెంట తీసుకెళ్లాను. పోలీసులు నా పరిస్థితి చూసి అనుమతించారు. కేవలం సరదా కోసం, ఒక మంచి వీడియో తీయాలనే ఉద్దేశంతో అలా చేశాను” అని వివరించాడు.

సరదా కోసం తీసిన వీడియో సంచలనం..

తమ జట్టు గెలవాలనే కోరికతో, యాదృచ్ఛికంగా వికెట్ పడే సమయంలో మంత్రాలు చదువుతున్నట్లు నటించానని సన్నీ తెలిపాడు. అది కేవలం ఒక కాకతాళీయ సంఘటన మాత్రమేనని, దాని వెనుక ఎటువంటి మంత్ర తంత్రాలు లేవని స్పష్టం చేశాడు. సోషల్ మీడియాలో మీమ్స్ కోసం చేసిన ఈ ప్రయత్నం ఇంతటి వివాదానికి దారి తీస్తుందని తాను ఊహించలేదని అతను పేర్కొన్నాడు. మూఢనమ్మకాలను నమ్మవద్దని, అది కేవలం క్రీడల్లో జరిగే ఒక సరదా అంశం మాత్రమేనని ఆయన విజ్ఞప్తి చేశాడు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us