Sunil Gavaskar: ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండా అసలు మ్యాచ్ ఎలా ఆడతారని సన్నీ ఆగ్రహం..
భారత జట్టు సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో ఓడిపోయిన తర్వాత, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లి సన్నద్ధమవుతోంది. అయితే, తొలి టెస్ట్‌కు ముందు ఐదు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను రద్దు చేయడంపై సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నెట్ ప్రాక్టీస్‌కు నిజమైన ప్రాక్టీస్ మ్యాచ్ కి మధ్య తేడా ఉంటుందన్నారు. ఇది బ్యాటర్లకు ఒత్తిడి ఎదుర్కోవడంలో ఉపయోగపడుతున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకపోడం వల్లే భారత జట్టు సేనా దేశాల్లో తొలి మ్యాచ్‌ల్లో గెలవలేదన్నారు. అలాగే, వర్క్‌లోడ్ పేరుతో విశ్రాంతి తీసుకోవడం కూడా సరైన నిర్ణయం కాదని సన్నీ పేర్కొన్నారు.

భారత జట్టు సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో చిత్తుగా ఓడిపోయిన తర్వాత, తదుపరి టెస్ట్ సిరీస్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ నవంబర్ 22న పెర్త్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు సన్నద్ధతపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
భారత జట్టు తొలి టెస్ట్‌కు ముందు ఇండియా-ఏ జట్టుతో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాలని నిర్ణయించినప్పటికీ, ఆటగాళ్లు గాయపడే ప్రమాదం ఉందని ఆఖరిలో ఆ మ్యాచ్‌ను రద్దు చేశారు. ఈ నిర్ణయంపై గవాస్కర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రాక్టీస్ మ్యాచ్ కు నెట్ ప్రాక్టీస్‌కు చాలా తేడా ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో బ్యాటర్‌కు లభించే ఫీలింగ్ నెట్ ప్రాక్టీస్‌లో అందదన్నారు.
భారత జట్టును 3-0తో క్లీన్ స్వీప్ చేసిన తర్వాత కూడా, న్యూజిలాండ్ ఆటగాళ్లు ముంబైలో నెట్ ప్రాక్టీస్ చేసారని గవాస్కర్ పేర్కొన్నారు. సన్నాహక మ్యాచ్‌ను రద్దు చేయడం అర్ధరహిత నిర్ణయం. సేనా దేశాల్లో భారత్ ఎప్పుడూ తొలి మ్యాచ్‌ల్లో గెలవలేదని అందుకు సరైన ప్రాక్టీస్ మ్యాచ్ లేకపోవడమే కారణమన్నారు గవాస్కర్.
నెట్ ప్రాక్టీస్‌లో బ్యాటర్లు కొన్నిసార్లు ఔటయ్యినా, ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ కొనసాగించవచ్చు. కానీ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆటగాళ్లు నిజమైన పోటీ పరిస్థితులను ఎదుర్కొంటారు, అందువల్ల ఒత్తిడి తట్టుకోడం ప్రాక్టీస్ మ్యాచులతో సులువవుతుందన్నారు. అందుకే ప్రాక్టీస్ మ్యాచులు చాలా కీలకమని పేర్కొన్నారు.
బౌలర్ల విషయంలో కూడా గవాస్కర్ స్పందించారు. నెట్ ప్రాక్టీస్‌లో బౌలర్ల రిథమ్ అందుకోరని.. వారు నోబాల్స్ వేసినట్టు అనిపించకపోవచ్చన్నారు. కానీ ప్రాక్టీస్ మ్యాచ్‌లో, బౌలర్లు ఏ లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తున్నామో, సరైన లెంగ్త్ ఏంటో వారికి అర్థమవుతుందన్నారు. అందుకే కనీసం రెండు రోజుల వామప్ గేమ్ ఆడాలని సూచించారు, దీంతో ఫామ్ కోల్పోయిన ఆటగాళ్ల తిరిగి లయను దొరకబుచ్చుకోవడానికి సహాయపడుతుందన్నారు.
భారత జట్టు వర్క్‌లోడ్ విధానంపై కూడా గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో 57 రోజుల పాటు ఉండనుంది. అయితే, 25 రోజులే మైదానంలో గడుపుతుంది. మిగతా సమయం వర్క్‌లోడ్ పేరుతో విశ్రాంతి తీసుకుంటారు అని ఆయన చెప్పారు. ప్రాక్టీస్ లేకుండా సరిగా సన్నద్ధత పొందడం కష్టమే అని గవాస్కర్ స్పష్టం చేశారు. సునీల్ గవాస్కర్ చేసిన ఈ కామెంట్స్ తో మ్యాచ్ కు ముందు టీమిండియా ప్రిపరేషన్‌పై పెద్ద చర్చ జరుగుతోంది. ప్రాక్టీస్, వర్క్‌లోడ్, సన్నద్ధత వంటి అంశాలపై అన్ని వైపుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.



