Six Sixes in an Over : ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. శ్రీలంక క్రికెటర్ రికార్డ్.. యువరాజ్ సింగ్ సరసన చోటు..
Six Sixes in an Over : శ్రీలంక నుంచి ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి లెఫ్ట్‌హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు సాధించాడు ఆల్‌రౌండర్ తిసారా పెరీరా.
Six Sixes in an Over : శ్రీలంక నుంచి ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి లెఫ్ట్‌హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు సాధించాడు ఆల్‌రౌండర్ తిసారా పెరీరా. పనగోడలోని ఆర్మీ గ్రౌండ్‌లో జరిగిన మేజర్ క్లబ్స్ లిమిటెడ్ ఓవర్ లిస్ట్ ఎ టోర్నమెంట్‌లో.. బ్లూమ్‌ఫీల్డ్ క్రికెట్, అథ్లెటిక్ క్లబ్‌తో జరిగిన గ్రూప్ ఎ మ్యాచ్‌లో శ్రీలంక ఆర్మీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ఘనత సాధించాడు.
31 ఏళ్ల పెరీరా 13 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఉస్మాన్ ఇషాక్ అషన్ రండికాను ఔట్ చేయడంతో అతను బ్యాటింగ్‌కు వచ్చాడు. పెరీరా కేవలం 20 బంతులు మాత్రమే మిగిలి ఉండగానే బ్యాటింగ్‌కు వచ్చాడు. 39 వ ఓవర్ చివరి బంతిలో సిక్సర్‌తో తన పరుగుల వేట ప్రారంభించాడు. చివరి ఓవర్లో ఆఫ్-స్పిన్ బౌలర్ దిల్హాన్ కూరేలో 36 పరుగులు చేశాడు. 34 ఏళ్ల కూరే తన నాలుగు ఓవర్లలో 73 పరుగులు సమర్పించాడు.పెరీరా విజృంభనతో శ్రీలంక ఆర్మీ 41 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 318 పరుగులతో ముగిసింది.
ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్ వెస్టిండీస్‌కి చెందిన సర్ గార్ఫీల్డ్ సోబర్స్. ఇతడు 1968 లో ఈ ఘనత సాధించాడు. 2007 కరేబియన్లో జరిగిన ప్రపంచ కప్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో రికార్డు సాధించిన తొలి బ్యాటర్ దక్షిణాఫ్రికాకు చెందిన హెర్షెల్ గిబ్స్. యువరాజ్ సింగ్ 2007 లో దక్షిణాఫ్రికాలో జరిగిన టి 20 ప్రపంచ కప్‌లో ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఆంటిగ్వాలో ఇటీవల శ్రీలంకతో జరిగిన టి 20 ఐ సిరీస్‌లో మైలురాయిని చేరుకున్న మరో బ్యాటర్ కీరోన్ పొలార్డ్.
సీనియర్ క్రికెట్‌లో ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టే బ్యాటర్‌ల జాబితా ఇలా ఉంది.. సర్ గార్ఫీల్డ్ సోబర్స్ (1968), రవిశాస్త్రి (1985), హెర్షెల్ గిబ్స్ (2007), యువరాజ్ సింగ్ (2007), రాస్ వైట్లీ (2017), హజ్రతుల్లా జజాయ్ (2018), లియో కార్టర్ (2020), కీరోన్ పొలార్డ్ (2021), తిసారా పెరీరా (2021).