AUS vs IND: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోంది. లండన్‌లోని ఓవల్ మైదానంలో ఈ అల్టిమేట్ టెస్ట్ నిన్న ప్రారంభమైంది. కాగా, మొదటి రోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు మూడు వికెట్లకు 327 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అయితే, తొలిరోజు ఆటలో తొలి సెషన్‌లో జోరు చూపించిన భారత్.. ఆ తర్వాత రెండు సెషన్‌లో తీవ్రంగా నిరాశపరిచింది. ఓవైపు రోహిత్ నిర్ణయాలు, మరోవైపు భారత్ బౌలర్ల పేలవ ప్రదర్శనతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. దీనిపై పలువురు మాజీలు కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఇదే క్రమంలో శ్రీరెడ్డి కూడా తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించింది. టీమిండియా సారథి రోహిత్ శర్మపై విరుచుకపడింది. అయితే, రూటు మార్చిన శ్రీరెడ్డిని చూసిన నెటిజన్లు కూడా షాకయ్యారు. ఇన్నాళ్లు సినిమా రంగానికి, రాజకీయాలకు సంబంధించిన వారిపై విమర్శలు గుప్పించిన శ్రీరెడ్డి.. తాజాగా క్రికెట్‌పై కన్నేసిందా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
రోహిత్ శర్మను విమర్శిస్తూ.. కోహ్లీని పొగుడుతూ ట్విట్టర్లో ఓ ట్వీట్ చేసింది. ‘తొక్కలో Captaincy, ఇదేమన్నా IPL అనుకున్నావా బాబు, నీ Captaincy చూసి కోహ్లి నవ్వుకుంటున్నాడు, ఇదేంట్రా బాబు అని, రోజంతా ఫీల్డింగ్ చేస్తూ బౌలింగ్ చెయ్యాలంటే ప్లేయర్స్ లో జోష్ కావాలి, అది కోహ్లి ఒక్కడే చెయ్యగలడు, He will inspire players, He is the Best Test Captain in the World’ అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చింది.
తొక్కలో Captaincy, ఇదేమన్నా IPL అనుకున్నావా బాబు, నీ Captaincy చూసి కోహ్లి నవ్వుకుంటున్నాడు, ఇదేంట్రా బాబు అని, రోజంతా ఫీల్డింగ్ చేస్తూ బౌలింగ్ చెయ్యాలంటే ప్లేయర్స్ లో జోష్ కావాలి, అది కోహ్లి ఒక్కడే చెయ్యగలడు, He will inspire players, He is the Best Test Captain in the World ?
— Sri Reddy (@MsSriReddy) June 7, 2023
మరో ట్వీట్‌లో హైదరాబాదీ పేసన్ సిరాజ్ బౌలింగ్‌పైనా కామెంట్స్ చేసింది. బౌలింగ్ తక్కువ, బలుపు ఎక్కువ అంటూ ట్వీట్ చేసింది. దీంతో నెటిజన్లు శ్రీరెడ్డి ట్వీట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చిగా తిడుతూ రిప్లై చేస్తున్నారు. మరోవిషయం ఏంటంటే.. క్రికెట్ గురించి తెలియకుండా కామెంట్స్ చేయడం ఏంటంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
How Cheap Siraj is ?? బౌలింగ్ తక్కువ బలుపు ఎక్కువ ?
— Sri Reddy (@MsSriReddy) June 8, 2023
కాగా, ఈ ట్విటర్ట్ అకౌంట్ శ్రీరెడ్డి కాదంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.. మరికొందరు ఆమెదేనంటూ చెబుతున్నారు. అయితే, ఈ అకౌంట్‌లో ఆమె ఒరిజినల్ ఫేస్ బుక్ అకౌంట్ లింక్ కూడా ఉండడంతో ఆమెదేనని చెబుతున్నారు. శ్రీరెడ్డి కూడా ఈ ట్విట్టర్ అకౌంట్ తనది కాదని ఎక్కడా చెప్పలేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..