Sri Lanka vs New Zealand: చివరి బంతికి 7 పరుగులు.. క్రీజులో బౌలర్.. కట్‌చేస్తే.. రిజల్ట్‌లో భారీ షాక్..

NZ vs SL: చివరి బంతికి న్యూజిలాండ్‌కు 7 పరుగులు అవసరం. అయితే, అంతా దాదాపు అసాధ్యమే అనకున్నారు. ఆ తర్వాత ఇష్ సోధి బ్యాట్ ఝుళిపించి అద్భుతాలు చేశాడు. అయితే సూపర్‌ ఓవర్‌లో కష్టానికి మరో ఎదురుదెబ్బ తగిలింది.

Sri Lanka vs New Zealand: చివరి బంతికి 7 పరుగులు.. క్రీజులో బౌలర్.. కట్‌చేస్తే.. రిజల్ట్‌లో భారీ షాక్..
Nz Vs Sl
Follow us
Venkata Chari

|

Updated on: Apr 02, 2023 | 2:42 PM

ఆదివారం న్యూజిలాండ్- శ్రీలంక మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ సూపర్ ఓవర్‌కు చేరుకుంది. సూపర్ ఓవర్‌లో అద్భుతం జరిగింది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించింది. దీంతో శ్రీలంక జట్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 5 వికెట్లకు 196 పరుగులు చేసింది. చరిత్ అస్లాంక 67 పరుగులు, కుసల్ పెరీరా 53 పరుగులు చేశారు. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ జట్టు ఆరంభం చాలా దారుణంగా మారింది.

న్యూజిలాండ్ 3 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత టామ్ లాథమ్, డారెల్ మిచెల్, మార్క్ చాప్‌మన్ ఇన్నింగ్స్‌ను చేజిక్కించుకున్నారు. మిచెల్ 66 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర 26 పరుగుల వద్ద పెవిలియన్ బాట పట్టగా.. కివీస్ జట్టు ఓటమి బాట పట్టింది. ఆ తర్వాత ఇష్ సోధీ, హెన్రీ షిప్లీ సింగిల్స్‌తో స్కోరును 19.5 ఓవర్లలో 190 పరుగులకు చేర్చారు.

సిక్సర్‌తో మ్యాచ్ టై..

చివరి బంతికి న్యూజిలాండ్ విజయానికి 7 పరుగులు అవసరం. అయితే ఇది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. సోధి క్రీజులో ఉన్నాడు. దాసున్ షనక బౌలింగ్‌లో చివరి బంతికి కివీస్ బ్యాట్స్ మెన్ భారీ సిక్సర్ కొట్టి మ్యాచ్‌ను టై చేశాడు. టై అవుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ, సోధీ సిక్సర్ కొట్టి న్యూజిలాండ్‌కు మరో అవకాశం ఇచ్చారు. సూపర్ ఓవర్‌లో న్యూజిలాండ్‌కు జిమ్మీ నీషమ్, డారెల్ మిచెల్ బ్యాటింగ్‌కు దిగారు.

ఇవి కూడా చదవండి

మెండిస్, అస్లాంక సూపర్ ఇన్నింగ్స్..

సూపర్ ఓవర్‌లో న్యూజిలాండ్ 8 పరుగులు జోడించి 2 వికెట్లు కోల్పోయింది. నీషమ్ , చాప్‌మన్‌గా 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు శ్రీలంక నుంచి కుశాల్ మెండిస్, అస్లాంక బ్యాటింగ్‌కు దిగారు. ఆడమ్ మిల్నే వేసిన ఓవర్ రెండో బంతికి అస్లాంకా సిక్సర్ బాదాడు. తర్వాతి బంతి నో బాల్ అయితే దీనిపై కూడా అస్లాంక ఫోర్ కొట్టి శ్రీలంకకు విజయాన్ని అందించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..