SRH vs PBKS: చివరి ఓవర్లో 9 బంతులు.. 3 క్యాచ్‌లు, 3 రనౌట్‌లు మిస్.. తృటిలో ఓటమి తప్పించుకున్న హైదరాబాద్..
Punjab Kings vs Sunrisers Hyderabad, 23rd Match: పంజాబ్ విజయానికి చివరి ఓవర్‌లో 29 పరుగులు చేయాల్సి వచ్చింది. ఉనద్కత్ బౌలింగ్‌కు వచ్చాడు. తొలి బంతి సిక్సర్‌గా మారింది. ఆ తర్వాత ఉనద్కత్ రెండు వైడ్లు వేశాడు. రెండో బంతికి వేసిన షాట్ కూడా ఫీల్డర్ చేతికి చిక్కకుండా సిక్సర్ వెళ్లింది. తర్వాత మూడో, నాలుగో బంతికి రెండేసి పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి సులభమైన క్యాచ్ పడింది. అంతే కాదు మూడు, నాలుగో బంతుల్లో రనౌట్ అయ్యే అవకాశం వచ్చింది. అది కూడా విఫలమైంది.
Punjab Kings vs Sunrisers Hyderabad, 23rd Match: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. హైదరాబాద్ జట్టు చివరి ఓవర్‌లో మూడు క్యాచ్‌లు వదిలేయగా, రెండు రనౌట్‌లను మిస్ చేసింది. అయితే చివరికి SHR జట్టు విజయం సాధించడంతో.. ఊపిరిపీల్చుకుంది. చివరి ఓవర్లో జయదేవ్ ఉనద్కత్ 26 పరుగులు ఇచ్చాడు. చివరి ఓవర్‌లో ఏం డ్రామా జరిగిందన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు ఆరంభంలోనే తడబడింది. హెడ్ 15 బంతుల్లో 21 పరుగులు చేశాడు. మక్రం డకౌట్ అయ్యాడు. అభిషేక్ శర్మ 16 పరుగులు చేశాడు. నితీష్ రెడ్డి బృందానికి మద్దతు పలికారు. 37 బంతుల్లో 64 పరుగులు చేశాడు. చివర్లో హైదరాబాద్ జట్టు 182 పరుగులు చేసి 183 పరుగుల టార్గెట్ ఇచ్చింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్ కూడా పేలవ ఆరంభాన్ని చవిచూసింది. ధావన్ 14 పరుగుల వద్ద అవుట్ కాగా, బ్రెస్టో సున్నా వద్ద ఉన్నాడు. శామ్ కరణ్, రాజా కూడా భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేదు. 19 ఓవర్లు పూర్తయ్యే సరికి పంజాబ్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది.
So close, yet so far for Shashank and #PBKS 💔#IPLonJioCinema #TATAIPL #PBKSvSRH pic.twitter.com/F51V0OzroY
— JioCinema (@JioCinema) April 9, 2024
పంజాబ్ విజయానికి చివరి ఓవర్‌లో 29 పరుగులు చేయాల్సి వచ్చింది. ఉనద్కత్ బౌలింగ్‌కు వచ్చాడు. తొలి బంతి సిక్సర్‌గా మారింది. ఆ తర్వాత ఉనద్కత్ రెండు వైడ్లు వేశాడు. రెండో బంతికి వేసిన షాట్ కూడా ఫీల్డర్ చేతికి చిక్కకుండా సిక్సర్ వెళ్లింది. తర్వాత మూడో, నాలుగో బంతికి రెండేసి పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి సులభమైన క్యాచ్ పడింది. అంతే కాదు మూడు, నాలుగో బంతుల్లో రనౌట్ అయ్యే అవకాశం వచ్చింది. అది కూడా విఫలమైంది. తర్వాత మరో వైడ్ బాల్. ఐదో బంతికి ఒక పరుగు, ఆరో బంతికి సిక్స్ వచ్చాయి. దీంతో హైదరాబాద్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. అశుతోష్ శర్మ 15 బంతుల్లో 33 పరుగులు చేసినా విజయం సాధించలేకపోయాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..