SRH: ఆ మాయదారి రూ. 17 కోట్ల ప్లేయర్ మాకొద్దు.! కావ్యపాప డబ్బులు తగలెయ్యొద్దని..
ఐపీఎల్ రిటైన్, రిలీజ్ ప్రక్రియ ముగిసింది. ఇక ఇప్పుడు ట్రేడ్ విండో ఓపెన్ ఉండగా.. అటు మినీ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు ఎదురు చూస్తున్నాయి. అలాగే ఓ ప్లేయర్ కోసం ఫ్రాంచైజీలు క్యూ కట్టగా.. ఆ ప్లేయర్ తమకొద్దు అని ఆరెంజ్ ఆర్మీ అంటోంది. మరి అతడెవరో తెలుసా.?

ఐపీఎల్ రిటైన్, రిలీజ్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 10 ఫ్రాంచైజీలు తమ రిటైన్ ప్లేయర్స్ లిస్టును విడుదల చేయగా.. పలువురు స్టార్ ఆటగాళ్లు వేలంలోకి రాగా.. ఎన్నో ఏళ్లుగా ఫ్రాంచైజీకి సేవలు అందిస్తున్న వారిని.. ఎలా వదిలేశారని ఫ్యాన్స్‌లో అనుమానాలు మొదలయ్యాయి. ఇక ఇదంతా అటుంచితే.. కేకేఆర్ బ్యాటింగ్‌కు వెన్నుముకగా నిలిచిన ఆండ్రీ రస్సెల్ ఈసారి వేలంలోకి వచ్చాడు. అలాగే మ్యాక్స్‌వెల్‌ను పంజాబ్, SRH షమీని పంపించేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. SRH తమ కోర్ టీంను అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పలువురు యువ ఆటగాళ్లతో పాటు బౌలర్లను విడుదల చేసింది హైదరాబాద్ జట్టు. ప్రస్తుతం హైదరాబాద్ వద్ద రూ. 25.5 కోట్ల పర్సు ఉంది. వేలంలో గరిష్టంగా 8 మందిని.. అందులో ఇద్దరు విదేశీ ప్లేయర్స్‌ను కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ వైపు మొగ్గు చూపుతున్న పలు ఫ్రాంచైజీలు. అందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉండటం గమనార్హం. 2023, 24 సీజన్లలో గ్రీన్ ఐపీఎల్ ఆడగా.. మొదటి సంవత్సరం ముంబై తరపున.. ఆపై బెంగళూరు తరపున బరిలోకి దిగాడు. ఇక ఈ ఏడాది అయితే గ్రీన్ గాయం కారణంగా పాల్గొనలేదు. ఆ సమయంలో బెంగళూరు జట్టు గ్రీన్‌ను రూ. 17.5 కోట్లకు ట్రేడ్ చేసుకుంది.
ఇక ఇప్పుడు వేలంలో గ్రీన్ భారీ ధరకు అమ్ముడైతే.. అతడు మొత్తం సీజన్ ఆడతాడా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు. గాయం కారణంగా మధ్యలో వెళ్ళిపోయినా.. ఫ్రాంచైజీ పూర్తీ డబ్బు చెల్లించాల్సిందే.. అందుకే ఆ మాయదారి ప్లేయర్ మాకొద్దు అని ఆరెంజ్ ఆర్మీ అంటోంది. వేలంలో రస్సెల్, మ్యాక్స్‌వెల్‌లను సొంతం చేసుకోవాలని కావ్య మారన్‌ను కోరుతున్నారు ఫ్యాన్స్. అదీనూ తక్కువ ధరకు వస్తే తీసుకోవాలని.. పవర్ హిట్టర్స్ జట్టులో చాలానే ఉన్నారని.. భారీ ధరకు బదులుగా తక్కువ ధరలో విదేశీ ఆల్‌రౌండర్ వస్తే.. అటు బౌలింగ్ డెప్త్ పెరుగుతుందని ఫ్యాన్స్ అంటున్నారు.




