India Vs England: ప్లేయర్లు కావాలన్న టీం మేనేజ్‌మెంట్.. పట్టించుకోని సెలెక్టర్లు.. చురకలంటించిన బీసీసీఐ.!

India Vs England: ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు ముందు ఓపెనర్లు పృథ్వీ షా, దేవదూత్ పడిక్కల్‌లను పంపించాలని జట్టు యాజమాన్యం అభ్యర్దించగా..

India Vs England: ప్లేయర్లు కావాలన్న టీం మేనేజ్‌మెంట్.. పట్టించుకోని సెలెక్టర్లు.. చురకలంటించిన బీసీసీఐ.!
Shaw
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 07, 2021 | 1:57 PM

ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు ముందు ఓపెనర్లు పృథ్వీ షా, దేవదూత్ పడిక్కల్‌లను పంపించాలని జట్టు యాజమాన్యం అభ్యర్దించగా.. వారి అభ్యర్ధనను సెలెక్టర్లు పట్టించుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ సమయంలో శుభ్‌మాన్ గిల్‌కు గాయం అయింది. దీనితో అతడు టీంకు దూరం కాగా.. జట్టు యాజమాన్యం పృథ్వీ షా, దేవదూత్ పడిక్కల్‌లను ఇంగ్లాండ్ పంపించాలంటూ జూన్ 28న సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మకు మెయిల్ పెట్టింది. ఈ అభ్యర్ధనను పట్టించుకోలేదని సమాచారం. అలాగే అభిమన్యు ఈశ్వరన్ ఎంపికపై కూడా చర్చ కొనసాగుతోంది.

అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు ఈశ్వరన్ ఇంకా సన్నద్ధం అవలేదని జట్టు యాజమాన్యం చెబుతుంటే.. కోహ్లీ సమక్షంలోనే జట్టును ఎంపిక చేశామని సెలెక్టర్లు దుయ్యబట్టారు. అటు కెఎల్ రాహుల్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఎంపిక చేయాలని జట్టు యాజమాన్యం భావిస్తున్న సంగతి తెలిసిందే.

మరోవైపు ఈ వివాదంపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందించారు. ”జట్టు యాజమాన్యం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. జట్టు కూర్పు విషయంలో సెలెక్టర్లు ఎప్పుడూ టీమ్ మేనేజ్‌మెంట్ సూచనలు తీసుకుంటారు. అలాగే కెప్టెన్ విరాట్ కోహ్లీ సమక్షంలో జట్టును ఎంపిక చేశారు. జట్టు యాజమాన్యం ఏయే ప్లేయర్లను.. ఎలా ఉపయోగించుకోవాలో ఓ ప్లాన్ వేసుకోవాలి. రాహుల్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేశారు. జట్టు యాజమాన్యం ఏదైనా ప్రణాళికలో మార్పు అనుకుంటుంటే.. దానిని సరిగ్గా కమ్యూనికేట్ చేసుకోవాలి” అని చురకలు అంటించారు.

Also Read:

దర్జాగా రోడ్డుపై సింహాల నైట్ వాక్.. దడుసుకున్న స్థానికులు.. వీడియో వైరల్.!

టాయిలెట్ సీట్‌పై కూర్చున్న వ్యక్తి.. అంతలోనే ఊహించని షాక్.. మర్మాంగంపై కరిచిన పైథాన్.!

ఈ ఫోటోలో చిరుత ఉంది.. ఈజీగా గుర్తించవచ్చు.. ఎక్కడుందో కనిపెట్టండి.!

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..