AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: 22 ఫోర్లు, 3 సిక్సర్లు.. దులీప్ ట్రోఫీలో తొలి డబుల్ సెంచరీ.. వరుస శతకాలతో ఆర్ఆర్ ప్లేయర్ దూకుడు..

Duleep Trophy 2022: యశస్వి జైస్వాల్ దులీప్ ట్రోఫీలో తన మొదటి డబుల్ సెంచరీని సాధించాడు. దీనిపై రాజస్థాన్ రాయల్స్ ప్రత్యేకంగా అభినందించింది.

Watch Video: 22 ఫోర్లు, 3 సిక్సర్లు.. దులీప్ ట్రోఫీలో తొలి డబుల్ సెంచరీ.. వరుస శతకాలతో ఆర్ఆర్ ప్లేయర్ దూకుడు..
Yashasvi Jaiswal
Venkata Chari
|

Updated on: Sep 11, 2022 | 2:53 PM

Share

Yashasvi Jaiswal West Zone vs North East Zone, Duleep Trophy 2022: దులీప్ ట్రోఫీ 2022 మొదటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వెస్ట్ జోన్ వర్సెస్ నార్త్ ఈస్ట్ జోన్ మధ్య జరుగుతోంది. మ్యాచ్ నాలుగో రోజు లంచ్ విరామ సమయానికి వెస్ట్ జాన్ 465 పరుగుల ఆధిక్యంలో ఉంది. వెస్ట్ జోన్ 590 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ సమయంలో, యశస్వి జైస్వాల్ అద్భుత ప్రదర్శన చేస్తూ డబుల్ సెంచరీ సాధించాడు. దులీప్ ట్రోఫీలో అతనికి ఇదే తొలి డబుల్ సెంచరీ. ఈ మేరకు రాజస్థాన్ రాయల్స్ ప్రత్యేకంగా ట్వీట్ చేసింది.

యశస్వి ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. ఈ కారణంగా, రాజస్థాన్ అతని డబుల్ సెంచరీ వీడియోను ట్వీట్ చేసింది. ఇందులో డబుల్ సెంచరీ తర్వాత శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసింది. రాజస్థాన్ వీడియోతో పాటు, “దులీప్ ట్రోఫీలో యశస్వి తన మొదటి డబుల్ సెంచరీని చేశాడు” అని క్యాప్షన్ రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి 321 బంతులు ఎదుర్కొని 22 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 228 పరుగులు చేయడం గమనార్హం. కెప్టెన్ అజింక్య రహానే డబుల్ సెంచరీ తర్వాత నాటౌట్‌గా నిలిచాడు. రహానే 264 బంతుల్లో 18 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయంగా 207 పరుగులు చేశాడు. సెంచరీ తర్వాత పృథ్వీ షా ఔటయ్యాడు. 121 బంతుల్లో 113 పరుగులు చేశాడు.