Sachin: పాత సచిన్‌ను గుర్తుకు తెచ్చాడుగా.. నిన్నటి మ్యాచ్‌లో మాస్టర్ బ్లాస్టర్‌ ట్రేడ్‌మార్క్‌ షాట్‌ చూశారా?

Viral Video: మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ (Sachin Tendulkar) మళ్లీ క్రికెట్‌ మైదానంలో అడుగుపెట్టాడు. క్రీజులో ఉన్నది కాసేపే అయినా తనకు మాత్రమే సాధ్యమయ్యే ట్రేడ్‌మార్క్‌ షాట్లతో క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించాడు.

Sachin: పాత సచిన్‌ను గుర్తుకు తెచ్చాడుగా.. నిన్నటి మ్యాచ్‌లో మాస్టర్ బ్లాస్టర్‌ ట్రేడ్‌మార్క్‌ షాట్‌ చూశారా?
Sachin Tendulkar
Follow us
Basha Shek

|

Updated on: Sep 11, 2022 | 2:04 PM

Viral Video: మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ (Sachin Tendulkar) మళ్లీ క్రికెట్‌ మైదానంలో అడుగుపెట్టాడు. క్రీజులో ఉన్నది కాసేపే అయినా తనకు మాత్రమే సాధ్యమయ్యే ట్రేడ్‌మార్క్‌ షాట్లతో క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించాడు. రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో భాగంగా శనివారం సచిన్‌ నాయకత్వంలోని ఇండియా లెజెండ్స్‌ జట్టు దక్షిణాఫ్రికా లెజెండ్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో సచిన్‌ కేవలం 16 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే క్రీజులో ఉన్నది కొద్ది సేపే అయినా తన ట్రేడ్‌ మార్క్‌షాట్లను మళ్లీ ఫ్యాన్స్‌కు రుచి చూపించాడు. ముఖ్యంగా ముఖియా ఎన్తిని బౌలింగ్‌లో అతను కొట్టిన లాఫ్టెడ్‌ షాట్‌ మరోసారి పాత సచిన్‌ను గుర్తుకు చేసింది. క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఈ షాట్‌ కనులవిందు అనిపించింది. ఈ షాట్‌ కొట్టగానే స్టేడియంలోని అభిమానులు కేరింతలు కొట్టారు. సచిన్‌.. సచిన్‌ అంటూ హర్షధ్వానాలు పలికారు.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్‌ చేసిన ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 రన్స్‌ చేసింది. స్టువర్ట్‌ బిన్నీ సంచలన ఇన్నింగ్స్‌(24 బంతుల్లో 82 రన్స్‌..5 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆడాడు. యూసుఫ్‌ పఠాన్‌ (15 బంతుల్లో 35, ఒక ఫోర్‌, 4 సిక్సర్లు) మరోసారి తన బ్యాట్‌ పవరేంటో చూపించాడు. ఆ తర్వాత ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో సచిన్‌ సేన 61 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు