T20 World Cup 2022: టీమిండియా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఫిట్‌నెస్ టెస్ట్‌ను క్లియర్ చేసిన ఆ స్టార్ ప్లేయర్స్!
Team India: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియా అదిరిపోయే గుడ్ న్యూస్. గాయాలతో బాధపడుతూ జట్టుకు దూరంగా ఉన్న యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), హర్షల్ పటేల్ (Harshal Patel) పూర్తి ఫిట్‌నెస్ సాధించారని ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్ బజ్ తెలిపింది.
Team India: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియా అదిరిపోయే గుడ్ న్యూస్. గాయాలతో బాధపడుతూ జట్టుకు దూరంగా ఉన్న యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), హర్షల్ పటేల్ (Harshal Patel) పూర్తి ఫిట్‌నెస్ సాధించారని ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్ బజ్ తెలిపింది. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న ఈ స్టార్ బౌలర్లు బీసీసీఐ నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్ట్‌ను క్లియర్ చేశారని పేర్కొంది. కాగా వచ్చే టీ20 ప్రపంచకప్‌తో పాటు స్వదేశంలో ఆసీస్, దక్షిణాఫ్రికాలతో జరిగే రెండు ద్వైపాక్షిక సిరీస్‌ల కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సెప్టెంబర్ 15 లేదా 16న సమావేశం కానుంది. ఈనేపథ్యంలో వీరిద్దరూ పూర్తి ఫిట్‌నెస్ సాధించడం టీమిండియాకు గుడ్‌న్యూస్ అని చెప్పవచ్చు.
కాగా ఆసియాకప్‌లో వీరిద్దరూ లేకుండానే బరిలోకి దిగిన భారతజట్టు ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అయిన బుమ్రా, హర్షల్ పటేల్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా పాక్, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ల్లో ఆఖరి ఓవర్లలో టీమిండియా పరాజయం పాలైంది. దీంతో వీరిద్దరు జట్టులోకి వస్తే టీమిండియా మరింత స్ట్రాంగ్ అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. కాగా ఆస్ట్రేలియాలోని పిచ్‌లు సీమర్లకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఐదుగురు బౌలర్లతో జట్టును ఎంపిక చేయాలని సెలెక్షన్ కమిటీ భావిస్తోంది. బుమ్రా, హర్షల్ పటేల్‌తో పాటు భువీ, ఆర్ష్‌దీప్ సింగ్ ఆసీస్ ఫ్లైట్ ఎక్కే అవకాశం ఉంది. ఇక ఐదో బౌలర్ కోసం దీపక్ చాహర్, సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ, అవేశ్ ఖాన్‌లు పోటీ పడనున్నారు.
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..