Asia Cup 2022: నేడే ఆసియా కప్ ఫైనల్ ఫైట్.. అమీతుమీ తేల్చుకోనున్న పాక్, శ్రీలంక
Asia Cup 2022 Final: ఆసియా కప్‌లో ఫైనల్ ఫైట్‌కి రెడీ అయ్యాయి శ్రీలంక-పాకిస్తాన్‌లు. అంచనాల్లేకుండా టోర్నీలోకి అడుగుపెట్టిన షనక బృందం హాట్ ఫేవరెట్‌గా మారింది. విజయాలపరంపరను కొనసాగుతూ ఆసియాకప్‌ను పట్టేయాలన్న కసితో ఉంది.
Asia Cup 2022 Final: ఆసియా కప్‌లో ఫైనల్ ఫైట్‌కి రెడీ అయ్యాయి శ్రీలంక-పాకిస్తాన్‌లు. అంచనాల్లేకుండా టోర్నీలోకి అడుగుపెట్టిన షనక బృందం హాట్ ఫేవరెట్‌గా మారింది. విజయాలపరంపరను కొనసాగుతూ ఆసియాకప్‌ను పట్టేయాలన్న కసితో ఉంది. మరోవైపు బాబర్ అండ్ కో కూడా సేమ్ కాన్ఫిడెంట్‌తో కనిపిస్తోంది. ఆసియా కప్ ఆరంభంలోనే ఆప్ఘన్ చేతిలో ఓటమి. ఆ తర్వాత బంగ్లాపై గెలుపుతో విజయాల బాట పట్టిన శ్రీలంక.. ఇండియా, పాక్‌లను ఓడించి ఫైనల్ ఫైట్‌కి రెడీ అయింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన శ్రీలంక.. టైటిల్ ఫేవరేట్‌గా మారింది. అటు పాక్ కూడా తామేం తక్కువ కాదంటోంది. ఇరు జట్లు ఆసియా కప్ ట్రోఫీ లక్ష్యంగా వ్యూహలు రచిస్తున్నాయి. బాబర్ అజమ్, షాదబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, ఫకర్ జమన్, ఖుష్‌దిల్ షాలతో పాక్ బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది.మహ్మద్ రిజ్వాన్, షా, ఉస్మాన్ ఖాదీర్‌లు తమదైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నారు. మరోవైపు శ్రీలంక టీమ్‌లో మెండిస్, గుణతిలక, నిస్సంక, డిసిల్వాలు రాణిస్తుండటం ప్లస్ పాయింట్‌గా చెప్పుకొవచ్చు. హసరంగ, ముదశన్ స్పీన్‌లో ఇరగదీస్తున్నారు. రెండు జట్లు సమ ఉజ్జీవులుగానే కనిపిస్తున్నాయి.
ఆరోసారి అదృష్టం వరించేనా?
కాగా ఆసియా కప్‌లో ఇప్పటిదాకా భారత్ ఏడుసార్లు.. లంక 5, పాక్ 2సార్లు టైటిల్స్ గెలిచాయి. లంక చివరిసారిగా 2014లో.. పాక్ 2012లో విజేతగా నిలిచాయి. ఈ ఎడిషన్‌లో ఎవరు విక్టరీ కొడతారన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. పాక్‌ను ఓడించి ఉత్సాహంతో ఉన్న లంక అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఓటమికి బదులు తీర్చుకుని ఆసియా కప్‌ను ఎగరేసుకు పోవాలని బాబర్ టీమ్ పట్టుదలగా ఉంది. దీంతో ఫైనల్ ఫైట్.. ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది ఆసియా కప్ 15వ ఎడిషన్ కాగా శ్రీలంక జట్టు ఫైనల్ చేరడం ఇది 12వసారి కావడం గమనార్హం. ఆరోసారి ఆసియా కప్ నెగ్గాలని శ్రీలంక కోరుకుంటోంది.
Less than 24 hours to go for the #AsiaCup2022 grand finale! ?
How excited are you❓#SLvPAK #RoaringForGlory pic.twitter.com/siMhOOZYN7
— Sri Lanka Cricket ?? (@OfficialSLC) September 10, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..