Virat Kohli: ఫించ్ వన్డే రిటైర్మెంట్‌పై కోహ్లీ ఎమోషనల్.. నీతో కలిసి ఆడడం ఎప్పటికీ మర్చిపోను అంటూ..
Aaron Finch Retirement: ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆదివారం న్యూజిలాండ్‌తో తన చివరి మ్యాచ్(146వ మ్యాచ్) ఆడనున్నాడు ఫించ్.
Aaron Finch Retirement: ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆదివారం న్యూజిలాండ్‌తో తన చివరి మ్యాచ్(146వ మ్యాచ్) ఆడనున్నాడు ఫించ్. టీ20 వరల్డ్‌కప్‌పై పూర్తి దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ స్టార్ బ్యాటర్ రిటైర్మెంట్ ప్రకటనలో తెలిపాడు. దీంతో పలువురు క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు అతనితో ఉన్న అనుబంధాన్ని గుర్తుకుతెచ్చుకుంటున్నారు. ఈనేపథ్యంలో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లి (Virat Kohli) ఫించ్ రిటైర్మెంట్‌పై స్పందించాడు. అతనితో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు.
‘వెల్‌డన్ ఫించీ.. నీకు ప్రత్యర్థిగా ఇన్నేళ్లు క్రికెట్ ఆడడం ఎప్పటికి మరిచిపోనూ. అలాగే ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరపున ఇద్దరం ఒకే జట్టుకు ప్రాతినిథ్యం వహించడం మంచి అనుభూతి కలిగించింది. ఆల్ ది బెస్ట్ ఫర్ టి20 క్రికెట్.. నీ రిటైర్మెంట్ తర్వాతి లైఫ్‌ను సాఫీగా సాగాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నాడు కోహ్లి. కాగా 2013 శ్రీలంకపై ఆసీస్ తరపున వన్డేల్లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు ఫించ్. మొత్తం145 వన్డేల్లో 5041 పరుగులు సాధించాడు. 54 వన్డేల్లో ఆసీస్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారించాడు. అతడి వన్డే కెరీర్‌లో ఇప్పటి వరకు 17 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా ఆసీస్ 2015 వరల్డ్‌కప్ గెలవడంతో ఫించ్ కీలక పాత్ర పోషించాడు. ఇక గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుకు ఫించ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే గత కొంతకాలంగా పేలవమైన ఫామ్‌తో సతమతమవుతోన్న అతను వన్డేలకు వీడ్కోలు పలికాడు.
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..