
Fraser-McGurk: క్రికెట్‌లో రికార్డులు శాశ్వతం కాదు. ఏ రికార్డైన ఎప్పుడోకప్పుడు బద్దలవ్వాల్సిందే. అయితే, కొన్ని రికార్డులు ఇప్పటికీ అలానే ఉన్నాయి. వాటిని బ్రేక్ చేయలేకపోతున్నారు. అయితే, తాజాగా అలాంటి ఓ రికార్డ్ నేడు బద్దలైంది. ఆదివారం అడిలైడ్‌లోని కరెన్ రోల్టన్ ఓవల్‌లో టాస్మానియాతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణ ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ ఓ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి, ఏబీడీ నెలకొల్పిన రికార్డ్‌ను 435 రోజుల తర్వాత బద్దలు కొట్టాడు. మార్ష్ కప్‌లో భాగంగా ఈ సౌత్ ఆస్ట్రేలియా బ్యాటర్ కేవలం 29 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన పరిమిత ఓవర్ల సెంచరీని బాదేశాడు.
ఫ్రేజర్ మెక్‌గర్క్ సెంచరీతో గతంలో వెస్టిండీస్‌పై 2015లో ఏబీ డివిలియర్స్ సాధించిన 31 బంతుల రికార్డును బ్రేక్ చేశాడు. డివిలియర్స్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 16 సిక్సర్లతో 149 పరుగుల స్కోరుతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు.
అయితే, మెక్‌గుర్క్ 18 బంతుల్లో యాభైకి చేరుకున్నాడు. ఛేజింగ్‌లో తొలి రెండు ఓవర్లలో ఒక్క బంతినే ఎదుర్కొన్నాడు. అందులో ఒక్క పరుగు మాత్రమే చేశాడు. అయితే, మూడో ఓవర్ నుంచి పరుగుల వర్షం కురిపించాడు. సామ్ రెయిన్‌బర్డ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో నాలుగు సిక్స్‌లు, రెండు ఫోర్లతో సహా 32 పరుగులు పిండుకున్నాడు.
ఇలా కేవలం 18 బంతుల్లో 50 పరుగులు చేసి ఆస్ట్రేలియా దేశవాలీ క్రికెట్‌లో వేగవంతమైన అర్ధ సెంచరీకి పూర్తి చేశాడు. అంతకుముందు గ్లెన్ మాక్స్‌వెల్ 19 బంతుల్లో చేసిన మార్క్‌ను బద్దలు కొట్టాడు.
ఇక తొమ్మిదో ఓవర్‌లో అతను బిల్లీ స్టాన్‌లేక్‌పై వరుసగా మూడు సిక్సర్‌లను బాదేశాడు. ఆ తర్వాత అతను ఒక బౌండరీ, సింగిల్‌తో తన సెంచరీని సాధించాడు. ఈ క్రమంలో 12 సిక్సులు, 6 ఫోర్లు బాదేశాడు.
10వ ఓవర్‌లో వరుసగా నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి 128 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కాగా, 50 ఓవర్ల క్రికెట్ ఫార్మాట్‌లో ఓ ఆస్ట్రేలియన్ బ్యాటర్‌కు అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రికార్డును నెలకొల్పాడు.
21 ఏళ్ల అతను 38 బంతుల్లో 10 ఫోర్లు,13 సిక్సర్లతో 125 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 2019లో మెల్‌బోర్న్‌లో క్వీన్స్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విక్టోరియా తరపున అరంగేట్రం చేసిన తర్వాత ఫ్రేజర్-మెక్‌గర్క్‌కి ఇదే తొలి దేశీయ సెంచరీ కావడం గమనార్హం.
జోర్డాన్ సిల్క్ చేసిన ఈ సెంచరీతోపాటు కాలేబ్ జ్యువెల్, మాక్ రైట్‌ల తుఫాన్ అర్ధ సెంచరీల కారణంగా దక్షిణ ఆస్ట్రేలియా రికార్డు స్థాయిలో 436 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. గతంలో 420 పరుగుల రికార్డును 2016లో క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌పై సౌత్ ఆస్ట్రేలియా నెలకొల్పింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..