AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నన్ను కూడా స్పాట్ ఫిక్సింగ్‌లోకి లాగాలని చూశారు: ధోనీ

చెన్నై: తనను కూడా స్పాట్ ఫిక్సింగ్ కేసులోకి లాగాలని చూశారని ధోనీ చెప్పాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ‘రోర్ ఆఫ్ ది లయన్’ పేరుతో హాట్ స్టార్ విడుదల చేసిన డాక్యుమెంటరీలో ధోనీ మాట్లాడాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో చెన్నై జట్టుపై నిషేధం విధించిన సమయంలో ఎక్కడ చూసినా జట్టు గురించే చర్చ జరుగుతుండేదని అన్నాడు. ఫిక్సింగ్‌కు పాల్పడింది ఫ్రాంచైజీ కాదని, ఆయన అల్లుడని చెప్పాడు. దానికి అంత పెద్ద శిక్ష వేయాలా? అని ప్రశ్నించాడు. […]

నన్ను కూడా స్పాట్ ఫిక్సింగ్‌లోకి లాగాలని చూశారు: ధోనీ
Vijay K
|

Updated on: Mar 21, 2019 | 11:11 AM

Share

చెన్నై: తనను కూడా స్పాట్ ఫిక్సింగ్ కేసులోకి లాగాలని చూశారని ధోనీ చెప్పాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ‘రోర్ ఆఫ్ ది లయన్’ పేరుతో హాట్ స్టార్ విడుదల చేసిన డాక్యుమెంటరీలో ధోనీ మాట్లాడాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో చెన్నై జట్టుపై నిషేధం విధించిన సమయంలో ఎక్కడ చూసినా జట్టు గురించే చర్చ జరుగుతుండేదని అన్నాడు. ఫిక్సింగ్‌కు పాల్పడింది ఫ్రాంచైజీ కాదని, ఆయన అల్లుడని చెప్పాడు. దానికి అంత పెద్ద శిక్ష వేయాలా? అని ప్రశ్నించాడు.

రెండు సంవత్సరాల నిషేధం తమకన్నా అభిమానులనే అధికంగా కలచివేసిందని, చెన్నై ఫ్యాన్స్ లో ఎంతో మంది ఈ రెండు సంవత్సరాలూ ఐపీఎల్‌ మ్యాచ్‌ లనే చూడలేదని ధోనీ చెప్పుకొచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో తన అనుబంధం పెద్దలు కుదిర్చిన పెళ్లి వంటిదని వ్యాఖ్యానించిన ధోనీ, తానేమీ ఆ జట్టు కావాలని కోరుకోలేదని, ఫ్రాంఛైజీయే తనను కోరి జట్టులోకి తీసుకుని నాయకత్వ బాధ్యతలను అప్పగించిందని అన్నాడు. ఆ క్షణం నుంచే తనకు చెన్నైతో ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని, ఎల్లవేళలా అభిమానులు తమకు అండగా నిలిచారని చెప్పాడు.

Follow Us