AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: విధ్వంసం.. ఆసీస్‌పై లేడీ కోహ్లీ విశ్వరూపం! వన్డే చరిత్రలోనే ఫాస్టెస్ట్‌ సెంచరీ..

భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ వన్డేలో అద్భుత ప్రదర్శన చేసింది. స్మృతి మంధాన 50 బంతుల్లో సెంచరీ చేసి కొత్త రికార్డు సృష్టించింది. 413 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు అద్భుతంగా ఆడింది. మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్‌ల భాగస్వామ్యం విజయానికి కీలకం.

IND vs AUS: విధ్వంసం.. ఆసీస్‌పై లేడీ కోహ్లీ విశ్వరూపం! వన్డే చరిత్రలోనే ఫాస్టెస్ట్‌ సెంచరీ..
Smriti Mandhana
SN Pasha
|

Updated on: Sep 20, 2025 | 7:19 PM

Share

ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ క్రికెట్‌ ‍స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఇండియన్‌ ఉమెన్‌ టీమ్‌ బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా లేడీ కోహ్లీగా పేరు తెచ్చుకున్న స్మృతి మంధాన అయితే తన విశ్వరూపం చూపిస్తోంది. 413 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో అదే రేంజ్‌ బ్యాటింగ్‌ చేస్తూ.. కేవలం 23 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన మంధాన.. ఆ తర్వాత స్పీడ్‌ తగ్గించకుండా అదే ఊపులో సెంచరీ కూడా పూర్తి చేసుకుంది.

కేవలం 50 బంతుల్లోనే మంధాన సెంచరీ మార్క్‌ను అందుకొని.. ఆసీస్‌ బౌలర్లను ఉతికి ఆరేస్తోంది. ప్రస్తుతం 60 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్సులతో 120 పరుగులు చేసి దూసుకెళ్తోంది. కాగా వన్డే క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా మంధాన కొత్త చరిత్ర లిఖించింది. మంధాన బ్యాటింగ్‌ జోరు ముందు ఆసీస్‌ బౌలర్లు నిలువలేకపోతున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 47.5 ఓవర్లలో 412 పరుగుల భారీ స్కోర్‌ చేసి ఆలౌట్‌ అయింది.

ఆసీస్‌ బ్యాటర్లలో బెత్‌ మోనీ సెంచరీతో కదం తొక్కింది. 75 బంతుల్లో 23 ఫోర్లు, ఒక సిక్స్‌తో 138 పరుగులు చేసి అవుట్‌ అయింది. కాగా ప్రస్తుతం టీమిండియా 20 ఓవర్లలో 2 వికెట్ల కోల్పోయి 206 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 207 పరుగులు కావాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. క్రీజ్‌లో స్మృతి మంధానతో పాటు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఉంది. వీళ్లిద్దరూ ఎంత సేపు క్రీజ్‌లో ఉంటే.. టీమిండియాకు విజయావకాశాలు అంత పెరుగుతాయి. ఈ టార్గెట్‌ను టీమిండియా ఛేజ్‌ చేస్తే.. అది చరిత్ర అవుతుంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
జైస్వాల్ మనసు దోచిన ఈ లక్కీ లేడీ ఎవరు..? ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ
జైస్వాల్ మనసు దోచిన ఈ లక్కీ లేడీ ఎవరు..? ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం ఉంటుందా? మీ ఒంట్లో ఈ పార్ట్ పాడైనట్లే..
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం ఉంటుందా? మీ ఒంట్లో ఈ పార్ట్ పాడైనట్లే..
PSLలో వెలిసిన ఐపీఎల్ ఫ్యూచర్ స్టార్.. విధ్వంసానికే కేరాఫ్ అడ్రస్
PSLలో వెలిసిన ఐపీఎల్ ఫ్యూచర్ స్టార్.. విధ్వంసానికే కేరాఫ్ అడ్రస్
PPF లోన్ ఎలా తీసుకోవాలి? ఎవరు అర్హులు?
PPF లోన్ ఎలా తీసుకోవాలి? ఎవరు అర్హులు?
ఈ 6 మొక్కలు మీ ఇంట్లో ఉంటే AC అవసరం లేదు.. చల్ల చల్లని కూల్ కూల్
ఈ 6 మొక్కలు మీ ఇంట్లో ఉంటే AC అవసరం లేదు.. చల్ల చల్లని కూల్ కూల్
నల్లగా ఉన్న మీ మోచేతులను.. 5 నిమిషాల్లో తెల్లగా మార్చే చిట్కా!
నల్లగా ఉన్న మీ మోచేతులను.. 5 నిమిషాల్లో తెల్లగా మార్చే చిట్కా!
మీ జీవితంలో ఈ 5 మంది వ్యక్తులు ఉన్నారా? అయితే విజయం మీ సొంతమే!
మీ జీవితంలో ఈ 5 మంది వ్యక్తులు ఉన్నారా? అయితే విజయం మీ సొంతమే!
OTTలోకి వచ్చేసిన కాంట్రవర్సీ హారర్ థ్రిల్లర్..తెలుగులోనూ చూడొచ్చు
OTTలోకి వచ్చేసిన కాంట్రవర్సీ హారర్ థ్రిల్లర్..తెలుగులోనూ చూడొచ్చు
సూపర్.. అంటూ లాగించేస్తారు.. కానీ, ఇది తెలిస్తే షాకవ్వాల్సిందే..
సూపర్.. అంటూ లాగించేస్తారు.. కానీ, ఇది తెలిస్తే షాకవ్వాల్సిందే..
ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్
ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్