
జైపూర్: ఐపీఎల్‌లో భాగంగా మానసింగ్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్స్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ అజింక్యా రహానే 12 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. అయితే సంజూ శాంసన్ (35), రియాన్ పరాగ్ (43) సత్తా చాటడంతో పాటు స్టీవ్ స్మిత్ (59 నాటౌట్; 48 బంతుల్లో 5×4, 1×6) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడంతో రాజస్థాన్ తమ ముందున్న లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగులుండగానే ఛేదించింది.