Watch Video: డెబ్యూ మ్యాచులోనే ఘెర ప్రమాదం.. గాయపడిన విండీస్ ఆటగాడు.. స్ట్రెచర్‌పై హాస్పిటల్‌కు తరలింపు

వెస్టిండీస్, శ్రీలంక జట్ల మధ్య గాలేలో జరుగుతున్న తొలిటెస్టులో విండీస్ ఆటగాడు జెరెమీ సోలోజానో అరంగేట్రం చేశాడు. అయితే ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు బాల్ తలగడంతో తలకు తీవ్ర గాయమైంది. స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తరలించారు.

Watch Video: డెబ్యూ మ్యాచులోనే ఘెర ప్రమాదం.. గాయపడిన విండీస్ ఆటగాడు.. స్ట్రెచర్‌పై హాస్పిటల్‌కు తరలింపు
Sl Vs Wi 1 St Test
Follow us
Venkata Chari

|

Updated on: Nov 21, 2021 | 4:03 PM

SL vs WI: వెస్టిండీస్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టులో అరంగేట్రం చేసిన జెరెమీ సోలోజానో మ్యాచ్ సందర్భంగా తీవ్రంగా గాయపడ్డాడు. గాయం చాలా తీవ్రంగా ఉంది. అతన్ని స్ట్రెచర్‌పై మైదానం నుంచి తీసుకెళ్లారు. ఆపై అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. 26 ఏళ్ల సోలోజానో తన తొలి మ్యాచ్‌ను ఆడుతున్నాడు. ఫార్వర్డ్ షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తూ, బంతి ఆటగాడి హెల్మెట్ గ్రిల్‌కు తగిలడంతో అక్కడే కూలబడిపోయాడు. వెంటనే వైద్య సిబ్బంది అతన్ని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు.

ప్రమాదంపై అప్‌డే‌ట్ ఇచ్చిన వెస్టిండీస్ బోర్డు.. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఇన్‌జురీపై అప్‌డేట్‌ను ట్వీట్ చేసింది. గాయాన్ని స్కాన్ చేశామని, దాని తీవ్రత రిపోర్టులో తెలుస్తుందని తెలిపారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. 24వ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. షాట్ కొట్టిన బ్యాట్స్‌మెన్ శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే. సోలోజానో గాయపడినప్పుడు, అతను వెంటనే అతని క్షేమం గురించి ఆరా తీశాడు. వైద్య సిబ్బందిని పిలవమని కూడా సూచించాడు. ప్రస్తుతం ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్.. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్ టీం శ్రీలంక పర్యటనలో ఉంది. వెస్టిండీస్ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు శ్రీలంక చేరుకున్నారు. తొలి మ్యాచ్ గాలెలో జరుగుతోంది. 2021 టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్ల ప్రదర్శన పేలవంగానే ముగిసింది. శ్రీలంక జట్టుకు వెటరన్ దిముత్ కరుణరత్నే నాయకత్వం వహిస్తున్నాడు. అదే సమయంలో వెస్టిండీస్ జట్టుకు క్రెయిగ్ బ్రాత్‌వైట్ నాయకత్వం వహిస్తున్నాడు.

Also Read: IND vs NZ: 3 సిక్సులు.. 87 పరుగుల దూరంలో రోహిత్.. విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసే దిశగా హిట్‌మ్యాన్..!

IND vs NZ Predicted Playing 11: చివరి పోరులో ప్రయోగాలకు శ్రీకారం.. ‘బెంచ్‌’కు పరీక్ష.. ప్లేయింగ్‌ XIలో కొత్తగా చేరేది ఎవరంటే?