పిల్లాడు కాదు పిడుగు.. ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీసిన 12 ఏళ్ల బాలుడు.. క్రికెట్‌లో సంచలనం

క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించాలని ప్రతి బౌలర్‌ కలగంటాడు. అయితే అందరికీ ఈ ఘనత అందుకోవడం సాధ్యం కాదు. అందుకే ప్రపంచ క్రికెట్‌లో హ్యాట్రిక్‌ తీసిన బౌలర్లు పదుల సంఖ్యలోనే ఉంటారు. ప్రపంచ క్రికెట్‌లోని చాలా మంది ముఖ్యమైన బౌలర్లు హ్యాట్రిక్ ఘనత సాధించకుండానే తమ కెరీర్‌ను ముగించారు.

పిల్లాడు కాదు పిడుగు.. ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీసిన 12 ఏళ్ల బాలుడు.. క్రికెట్‌లో సంచలనం
Oliver Whitehouse

Updated on: Jun 17, 2023 | 5:22 PM

క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించాలని ప్రతి బౌలర్‌ కలగంటాడు. అయితే అందరికీ ఈ ఘనత అందుకోవడం సాధ్యం కాదు. అందుకే ప్రపంచ క్రికెట్‌లో హ్యాట్రిక్‌ తీసిన బౌలర్లు పదుల సంఖ్యలోనే ఉంటారు. ప్రపంచ క్రికెట్‌లోని చాలా మంది ముఖ్యమైన బౌలర్లు హ్యాట్రిక్ ఘనత సాధించకుండానే తమ కెరీర్‌ను ముగించారు. ఈక్రమంలో 12 ఏళ్ల పిల్లాడు హ్యాట్రిక్‌ తీసి ప్రపం చ రికార్డు సృష్టించాడు. అది కూడా ఓకే ఓవర్‌లో రెండుసార్లు. ఇంగ్లండ్‌ అండర్‌-12 క్రికెట్‌ పోటీల్లో ఈ రికార్డు క్రియేట్‌ కాగా ఆలివర్ వైట్‌హౌస్ అనే 12 ఏళ్ల బాలుడు ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన బ్రోమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్ తరఫున ఆడిన వైట్‌హౌస్.. కుఖిల్ జట్టుపై ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. తన ఇన్నింగ్స్‌లో కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన ఈ లెఫ్ట్‌ హ్యాండ్‌ స్పిన్నర్‌ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఎనిమిది వికెట్లు పడగొట్టడం విశేషం. వైట్‌ హౌస్‌ ఘనతను బ్రూమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్ కెప్టెన్ జేడెన్ లెవిట్ సోషల్ మీడియా ద్వారా షేర్‌ చేసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. క్లబ్ చేసిన పోస్ట్‌కి గంటల్లోనే 50 వేలకు పైగా వ్యూస్‌ వచ్చాయి.

 

ఇవి కూడా చదవండి

‘ఆలివర్ ఒకే ఓవర్‌లో డబుల్ హ్యాట్రిక్ పొందడం చాలా అద్భుతంగా ఉంది. నేనేతై ఇది నమ్మలేకపోతున్నాను. భవిష్యత్‌లో అతను క్లబ్‌ క్రికెట్‌లో కీలక ప్లేయర్‌గా ఎదుగుతాడు. అలాగే కౌంటీ క్రికెట్లోనూ రాణిస్తాడు ‘ అని బ్రూమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్ కెప్టెన్ జేడెన్ లెవిట్ వైట్‌ హౌస్‌పై ప్రశంసలు కురిపించాడు. కాగా ఆరివర్‌ రక్తంలోనే క్రికెట్‌ ఉందంటున్నారు ఫ్యాన్స్‌. అతను మరెవరో కాదు 1969 వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్ ఆన్ జోన్స్ మనవడే.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..