AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: వన్డే క్రికెట్‌కు పూర్వ వైభవం.. గిల్ కోరికకు గ్రీన్ సిగ్నల్.. మళ్లీ రానున్న ట్రై-సిరీస్‌లు

IND vs ENG: వన్డే క్రికెట్‌లో మళ్లీ ముక్కోణపు సిరీస్‌లను తీసుకురావాలన్న టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆలోచనకు ECB మద్దతు లభించింది. రాబోయే 12-18 నెలల్లో ట్రై సిరీస్‌లు పునరుద్ధరించే అవకాశం ఉందని ECB సీఈవో రిచర్డ్ గోల్డ్ తెలిపారు.

IND vs ENG: వన్డే క్రికెట్‌కు పూర్వ వైభవం.. గిల్ కోరికకు గ్రీన్ సిగ్నల్.. మళ్లీ రానున్న ట్రై-సిరీస్‌లు
Shubman Gill
Rakesh
|

Updated on: Aug 09, 2026 | 3:05 PM

Share

IND vs ENG: అంతర్జాతీయ క్రికెట్‌లో వన్డే ఫార్మాట్‌కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు, మ్యాచ్‌లను మరింత ఉత్కంఠభరితంగా మార్చేందుకు ఒక బృహత్తర అడుగు పడనుంది. అంతర్జాతీయ వన్డేల్లో ముక్కోణపు సిరీస్‌లను (ట్రై సిరీస్) పునరుద్ధరించాలని భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇటీవల వ్యక్తం చేసిన కోరికకు ఇప్పుడు విశేష ఆమోదం లభిస్తోంది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు సీఈవో రిచర్డ్ గోల్డ్ ఈ విషయమై సానుకూల సంకేతాలు ఇచ్చారు. రాబోయే 12 నుంచి 18 నెలల్లో క్రికెట్ క్యాలెండర్‌లో మూడు జట్ల మధ్య జరిగే ట్రై-సిరీస్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొనడంతో క్రికెట్ అభిమానులలో సరికొత్త ఉత్సాహం నెలకొంది.

ఒకప్పుడు వన్డే క్రికెట్‌లో ముక్కోణపు సిరీస్‌లు సృష్టించిన హడావుడి అంతా ఇంతా కాదు. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య చివరిసారిగా 2015 ప్రారంభంలో పెద్ద వన్డే ట్రై-సిరీస్ జరిగింది. అయితే ఆ తర్వాతి కాలంలో అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ బిజీగా మారడంతో కేవలం రెండు జట్ల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐసీసీ టోర్నమెంట్‌లకే ప్రాధాన్యత పెరిగింది. దాంతో ట్రై-సిరీస్ సంస్కృతి క్రమంగా మరుగున పడింది. ప్రస్తుతం బీసీసీఐ, ఈసీబీ వంటి బలమైన క్రికెట్ బోర్డులు భవిష్యత్ షెడ్యూల్స్ కోసం కలిసి పనిచేస్తున్నాయని, టీమిండియాకున్న భారీ క్రేజ్, మార్కెట్ విలువ శుభ్‌మన్ గిల్ ఆలోచన వెనుక బలమైన వ్యూహం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లలో ఒకే ప్రత్యర్థితో ఆడే అవకాశం ఉంటుంది, కానీ ట్రై-సిరీస్ ఆడితే ఏకకాలంలో రెండు బలమైన అగ్రశ్రేణి జట్లను ఎదుర్కొనే వెసులుబాటు లభిస్తుంది. ఇది ఐసీసీ మెగా టోర్నమెంట్‌లకు ముందు ఆటగాళ్ల ఫామ్‌ను, వివిధ రకాల జట్ల కాంబినేషన్లను పరీక్షించుకోవడానికి టీమిండియాకు ఒక అద్భుతమైన వేదికగా ఉపయోగపడుతుంది.

కేవలం రెండు జట్ల మధ్య జరిగే సిరీస్‌ల కంటే ముక్కోణపు సిరీస్‌లలో ఉత్కంఠ చాలా ఎక్కువగా ఉంటుంది. ట్రై-సిరీస్‌లో జరిగే ప్రతి మ్యాచ్ ఫలితం పాయింట్ల పట్టికపై నేరుగా ప్రభావం చూపుతుంది, దాంతో ప్రతీ పోరు నాకౌట్ మ్యాచ్‌లా మారుతుంది. అంతేకాకుండా కేవలం విజేతను పాయింట్లతో తేల్చకుండా, పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య తుది ఫైనల్ పోరు జరగడం టోర్నమెంట్ మీద ఉత్కంఠను పరాకాష్టకు తీసుకెళ్తుంది. వివిధ దేశాల ఆటతీరుకు అనుగుణంగా యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు ఇది మేలైన అవకాశం అందిస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us