AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shubman Gill : శుభ్‌మన్ గిల్-సారా టెండూల్కర్ వీడియో వైరల్.. ఆ ఓరచూపులు, చిరునవ్వుకు అర్థం ఏంటో?

టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల లండన్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో వీరిద్దరూ కలుసుకున్నారు. ఈ సమయంలో వీరి మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Shubman Gill : శుభ్‌మన్ గిల్-సారా టెండూల్కర్ వీడియో వైరల్.. ఆ ఓరచూపులు, చిరునవ్వుకు అర్థం ఏంటో?
Shubman Gill (1)
Rakesh
|

Updated on: Aug 09, 2025 | 12:27 PM

Share

Shubman Gill : టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇటీవల ఇంగ్లాండ్ పర్యటన తర్వాత చాలా వార్తల్లో నిలుస్తున్నారు. మైదానంలో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా అద్భుతమైన ప్రదర్శన చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. అయితే, ఆయన కేవలం ఆటతోనే కాదు, వ్యక్తిగత విషయాలతో కూడా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ మధ్య లండన్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో కలిసి కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఈవెంట్ నుంచి వచ్చిన ఒక కొత్త వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో గిల్, సారా ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకోవడం అభిమానుల్లో కొత్త చర్చకు దారితీసింది.

జూలై 8, 2025న మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన ‘యువీక్యాన్ ఫౌండేషన్’ కోసం లండన్‌లో ఒక ఛారిటీ డిన్నర్‌ను ఏర్పాటు చేశారు. క్యాన్సర్ అవగాహన మరియు నిధుల సేకరణ కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. టీమిండియా సభ్యులతో పాటు శుభ్‌మన్ గిల్ కూడా హాజరయ్యారు. ఈ వేడుకలో సారా టెండూల్కర్ కూడా ఉన్నారు.

ఇంతకు ముందు ఇదే ఈవెంట్ నుంచి ఒక వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో గిల్ సారా ముందు నుంచి వెళ్తున్నా, ఆమె వైపు చూడకుండా వెళ్లాడని వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు బయటకొచ్చిన ఈ కొత్త వీడియోలో గిల్, సారా ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. వీరిద్దరూ చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపించారు. గతంలో చాలా సార్లు వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని ఊహాగానాలు వినిపించాయి. ఈ కొత్త వీడియో ఈ ఊహాగానాలను మరోసారి తెరపైకి తెచ్చింది.

శుభ్‌మన్ గిల్ ఇంగ్లాండ్ పర్యటన ఆయన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-2తో సమం చేయడంలో గిల్ కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో 8 ఇన్నింగ్స్‌లలో గిల్ మొత్తం 754 పరుగులు సాధించి, అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి, వాటిలో 269 పరుగుల భారీ ఇన్నింగ్స్ కూడా ఒకటి. ఈ అద్భుతమైన ప్రదర్శనకు గాను గిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.