AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీమిండియాకు షాకింగ్ న్యూస్.. గౌహతి టెస్ట్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. అకస్మాత్తుగా ముంబైకి..?

IND vs SA 2nd Test: భారత్, దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ చివరి మ్యాచ్ గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు కొన్ని బ్యాన్ న్యూస్‌లు వచ్చాయి. జట్టు నుంచి ఒక స్టార్ ఆటగాడిని బీసీసీఐ విడుదల చేసింది.

టీమిండియాకు షాకింగ్ న్యూస్.. గౌహతి టెస్ట్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. అకస్మాత్తుగా ముంబైకి..?
Ind Vs Sa Test Team
Venkata Chari
|

Updated on: Nov 21, 2025 | 11:17 AM

Share

IND vs SA 2nd Test: భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. సిరీస్‌లో 0-1 తేడాతో వెనుకబడిన భారత జట్టు గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో రెండో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ టీమిండియాకు డూ ఆర్ డై మ్యాచ్ అవుతుంది. సిరీస్‌ను కాపాడుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మ్యాచ్ గెలవాల్సిందే. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు, టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దాని స్టార్ ఆటగాళ్ళలో ఒకరు ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు.

గౌహతి టెస్ట్ నుంచి తప్పుకున్న స్టార్ ప్లేయర్..

భారత టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నాడు. కోల్‌కతా టెస్ట్ సందర్భంగా అతనికి మెడ నొప్పి వచ్చింది. దీని వల్ల అతను మొత్తం మ్యాచ్ ఆడలేకపోయాడు. ఫలితంగా కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో చేరాడు. అప్పటి నుంచి, అతని పరిస్థితిని బీసీసీఐ, స్థానిక వైద్యులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం, BCCI ఇప్పుడు జాగ్రత్తగా నిర్ణయం తీసుకుని శుభ్‌మాన్ గిల్‌ను జట్టు నుంచి విడుదల చేసింది. అంటే అతను గౌహతి టెస్ట్‌కు దూరంగా ఉన్నాడు.