Shubman Gill : గిల్ మొండిపట్టు.. మెడకు కట్టు ఉన్నా.. రిస్క్ చేస్తూ ఆడాలని చూస్తున్న కెప్టెన్
భారత్, సౌతాఫ్రికా మధ్య జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్‌కి ముందు భారత టెస్ట్ కెప్టెన్ శుభమన్ గిల్ తీసుకుంటున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కోల్‌కతాలో జరిగిన మొదటి టెస్ట్‌లో బ్యాటింగ్ చేస్తుండగా మెడకు గాయం అయిన విషయం తెలిసిందే. ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోయినా ఈ కీలకమైన రెండో మ్యాచ్‌లో తాను తప్పకుండా ఆడాలి అని గిల్ పట్టుబడుతున్నాడని తెలుస్తోంది.

Shubman Gill : భారత్, సౌతాఫ్రికా మధ్య జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్‌కి ముందు భారత టెస్ట్ కెప్టెన్ శుభమన్ గిల్ తీసుకుంటున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కోల్‌కతాలో జరిగిన మొదటి టెస్ట్‌లో బ్యాటింగ్ చేస్తుండగా మెడకు గాయం అయిన విషయం తెలిసిందే. ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోయినా ఈ కీలకమైన రెండో మ్యాచ్‌లో తాను తప్పకుండా ఆడాలి అని గిల్ పట్టుబడుతున్నాడని తెలుస్తోంది. ఈ పరిస్థితిలో గాయంతో ఉన్న కెప్టెన్ ఆడటం సరైనదేనా అనే చర్చ మొదలైంది.
మెడ నొప్పితో బాధపడుతున్న గిల్ మొదటి టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు కూడా రాలేకపోవడం వలన టీమిండియా 30 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమితో సిరీస్‌లో 0-1 తో వెనుకబడిన టీమ్‌ను గెలిపించడానికి గిల్ సిద్ధమవుతున్నాడు. అతను ఇప్పటికే జట్టుతో కలిసి గువాహటికి చేరుకున్నాడు. గిల్ శనివారం నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోవచ్చు. అయినప్పటికీ అతను గురువారం, శుక్రవారం జరగబోయే ట్రైనింగ్ సెషన్స్‌లో పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నాడు. గిల్ మెడకు ఇంకా బ్యాండేజ్ ఉన్నప్పటికీ, అతని ఆరోగ్యం మెరుగుపడింది. గిల్ ఆడాలా వద్దా అనే తుది నిర్ణయాన్ని బీసీసీఐ మెడికల్ టీమ్ సలహా మేరకు నవంబర్ 21న తీసుకుంటుంది.
కోల్‌కతా టెస్ట్‌లో స్పిన్ ట్రాప్‌లో చిక్కుకుని టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గౌహతిలో కూడా టీమ్ మేనేజ్‌మెంట్ ఆదేశాల మేరకు స్పిన్-ఫ్రెండ్లీ పిచ్‌ను తయారు చేస్తున్నట్లు సమాచారం. 22 గజాల స్పిన్ ట్రాక్‌పై గాయంతో ఉన్న గిల్ ఆడటం టీమ్‌కు పెద్ద సవాలుగా మారవచ్చు. ఒకవేళ జట్టు టాస్ ఓడిపోతే, బ్యాటింగ్ చేయడం మరింత కష్టమవుతుంది.
ప్రస్తుతం టీమ్ ఇండియా సిరీస్‌లో 0-1 తేడాతో వెనుకబడి ఉంది. గౌహతిలో కూడా ఓటమి ఎదురైతే, సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి కీలక సమయంలో కెప్టెన్ గిల్ ఆడటానికి మొండిపట్టు పట్టడం ఒకవైపు సాహసంగా అనిపిస్తున్నా, మరోవైపు పూర్తిగా ఫిట్‌గా లేని ఆటగాడిని బరిలోకి దింపడం జట్టుకు ప్రమాదకరం కావచ్చు. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
