Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shreyas Iyer – IPL 2021: అయ్యారే.. అయ్యర్‌ షాట్‌ అదిరిపోయింది.. షాకింగ్ వీడియో మీకోసం..!

Shreyas Iyer - IPL 2021: ఐపీఎల్‌ 2021 రెండో సీజన్‌కు రెడీ అవుతున్నాడు టీమిండియా ఆటగాడు శ్రేయాస్‌ అయ్యర్‌. ప్రస్తుతం యూఏఈలో ఉన్న అయ్యర్‌ దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ మైదానంలో

Shreyas Iyer - IPL 2021: అయ్యారే.. అయ్యర్‌ షాట్‌ అదిరిపోయింది.. షాకింగ్ వీడియో మీకోసం..!
Shreyas Iyer
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 19, 2021 | 10:15 AM

Shreyas Iyer – IPL 2021: టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా మొదటి దశ ఐపీఎల్‌కు దూరం అయిన సంగతి తెలిసిందే. గాయం నుంచి కోలుకున్న అయ్యర్.. తిరిగి బ్యాట్ పట్టాడు. యూఏఈ వేదికగా కఠోర సాధన చేస్తున్నాడు. అంతేకాకుండా తన ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలోనే అయ్యర్‌ బ్యాటింగ్‌కు సంబంధించిన ఓ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐపీఎల్‌ 2021 రెండో సీజన్‌కు రెడీ అవుతున్నాడు టీమిండియా ఆటగాడు శ్రేయాస్‌ అయ్యర్‌. ప్రస్తుతం యూఏఈలో ఉన్న అయ్యర్‌ దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ మైదానంలో ప్రాక్టీస్‌లో మునిగిపోయాడు. ప్రాక్టీస్‌ సమయంలో అయ్యార్‌ ఆడిన షాట్లను చూసి.. నెటిజన్స్‌ అయ్యారే అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో ఫుల్‌ వైరల్‌ అవుతుంది.

శ్రేయాస్‌ అయ్యార్‌.. కొట్టిన సిక్సర్‌ మైదానం అవతల పడింది. దీనికి సంబంధించిన వీడియోను అయ్యర్‌ తన ఇన్‌స్టాలో షేర్‌ చేయగా.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శ్రేయాస్‌ అయ్యర్‌ భుజం గాయంతో ఈ సీజన్‌కు అనూహ్యంగా దూరమయ్యాడు. అతని గైర్హాజరీలో రిషబ్‌ పంత్‌ నాయకత్వం వహించాడు. కాగా, సెప్టెంబర్ నుంచి మొదలు కానున్న ఐపీఎల్ 2021 సెకండాఫ్ మ్యాచ్‌లు యూఏఈ వేదికగా జరుగనున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు రిషబ్ పంత్ సారథ్యం వహిస్తుండగా.. గాయం నుంచి అయ్యర్ కోలుకోవడంతో తిరిగి పగ్గాలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయం తేలాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.

Video:

Also read:

వీడు మామూలోడు కాదు.. డివిలియర్స్‌ను మించిపోయాడు.. డెబ్యూ మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ అర్ధ శతకం సాధించాడు..

Bharat Biotech: భారత్ బయోటెక్ నుంచి మరో గుడ్ న్యూస్.. చిన్నారులకు త్వరలో టీకా..!

టోక్యో క్రీడాకారులతో ప్రధాని మోడీ ముచ్చట్లు.. వైరల్ అవుతున్న వీడియో:Tokyo Olympics contingent video.