Bharat Biotech: భారత్ బయోటెక్ నుంచి మరో గుడ్ న్యూస్.. చిన్నారులకు త్వరలో టీకా..!

Bharat Biotech: కొవాగ్జిన్ పేరుతో కరోనా టీకాలు ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. మరో రెండు నెలల్లో చిన్నారులకు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు

Bharat Biotech: భారత్ బయోటెక్ నుంచి మరో గుడ్ న్యూస్.. చిన్నారులకు త్వరలో టీకా..!
Covid Vaccine
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 19, 2021 | 10:35 AM

Bharat Biotech: కొవాగ్జిన్ పేరుతో కరోనా టీకాలు ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. మరో రెండు నెలల్లో చిన్నారులకు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆ సంస్థ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు. ‘ఎఫ్ఐ హెల్త్ కేర్ సమ్మిట్’లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ టీకాను రెండు నుంచి 18 ఏళ్లలోపు వారికి ఇవ్వొచ్చని, ఇప్పటికే నిర్వహించిన పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చినట్టు పేర్కొన్నారు. టీకా పూర్తి భద్రత ఇస్తుందని ఇప్పటికే స్పష్టమైందని, రోగ నిరోధకశక్తి ఎలా ఉందనే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు కృష్ణ ఎల్ల తెలిపారు. టీకాకు సంబంధించి పూర్తి వివరాలు మరో నెల రోజుల్లో వెల్లడిస్తామన్నారు. టీకా క్లినికల్ ట్రయల్స్‌పై భారత ఔషధ నియంత్రణ మండలి సంతృప్తి చెందితే టీకాకు అనుమతి లభిస్తుందని, ఇదంతా జరిగేందుకు రెండు నెలల సమయం పట్టవచ్చని తెలిపారు. అలాగే, కొవిడ్, రేబిస్ రెండింటికీ ఒకే టీకా ఇచ్చే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్టు డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు.

ఇదిలాఉంటే.. ‘నాసల్ వ్యాక్సీన్’(ముక్కు ద్వారా ఇచ్చే టీకా) పై ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయని, రెండు మూడు నెలల్లో దీనికి సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు. అలాగే ఒక డోస్ ఇంజెక్షన్, మరో డోస్ నాసల్ వ్యాక్సిన్ ఇచ్చే అంశంపైనా పరిశోధనలు జరుపుతున్నట్లు వెల్లడించారు. అయితే, కోవిడ్ వ్యాక్సీన్‌ను ఇంజెక్షన్‌ రూపొంలో పొందిన వ్యక్తికి కరోనా సోకినా పెద్దగా ప్రమాదం ఉండబోదన్నారు. అయితే, బాధిత వ్యక్తి నుంచి ఇతరులకు కరోనా సోకే ప్రమాదం మాత్రం ఉంటుందన్నారు. అదే నాసల్ వ్యాక్సీనేషన్ ద్వారా కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇక.. కోవిడ్19, రేబిస్‌లకు ఒకే టీకా ఇచ్చే అంశాలను కూడా పరిశీలిస్తున్నామని డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు. దానికి సంబంధించి అమెరికాలోని థామస్ జెఫర్సన్ యూనివర్సిటీ ఆఫ్ ఫిలడెల్ఫియాతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది.

Also read:

Shreyas Iyer – IPL 2021: అయ్యారే.. అయ్యర్‌ షాట్‌ అదిరిపోయింది.. షాకింగ్ వీడియో మీకోసం..!

Corona Vaccine: టీకా సెంటర్‌లో యువకుడి హాంగామా.. చిన్న పిల్లాడిలా ఒకటే ఏడుపు..

Telangana Corona: తెలంగాణలో తగ్గిన కరోనా సెకండ్ వేవ్ తీవ్రత.. అలాగని ఆదమరిచారో అంతే సంగతులు..