IPL 2025: రోహిత్, కోహ్లీ కాదు భయ్యా.! రాసిపెట్టుకో ఈసారి ఆ పిచ్చోడిది ఊహకందని ఊచకోత
ధోని, కోహ్లీ, రోహిత్ శర్మలు కాదు.. ఇప్పుడు ఐపీఎల్‌లో మరో చేజ్ మాస్టర్, అలాగే విన్నింగ్ కెప్టెన్ మరొక ప్లేయర్ అవతారమెత్తాడు. అతడు మరెవరో కాదు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్.. వరుసగా 6 మ్యాచ్‌లలో విజయాలు అందుకుని.. ఈసారి ట్రోఫీ కొట్టేదాకా ఆగేలా లేడు.

ఐపీఎల్ 2025 పాయింట్స్ టేబుల్‌ను తలకిందులు చేసింది. ఇప్పటిదాకా ట్రోఫీ గెలవని ఆర్సీబీ, పంజాబ్, ఢిల్లీ జట్లు టాప్ 3 స్థానాల్లో నిలిచాయి. మరీ ముఖ్యంగా మెగా వేలంలో అత్యధిక ధర పలికిన శ్రేయాస్ అయ్యర్.. ప్రస్తుత పంజాబ్ కెప్టెన్ ఊహకందని ఊచకోతకు తెరలేపాడు. జట్టుకు వరుస విజయాలు అందించడమే కాదు.. గతేడాది కేకేఆర్‌కు 4 విజయాలు.. ఇప్పుడు పంజాబ్‌కు 2 విజయాలతో డబుల్ హ్యాట్రిక్ విన్స్ సొంతం చేసుకున్నాడు. అలాగే ఐపీఎల్‌లో అత్యధిక విన్ పర్సంటేజీ సాధించిన మూడో కెప్టెన్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఆయన 72 మ్యాచ్‌లకు సారధ్యం వహించి 55.55 శాతం విజయాలు సాధించారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ(55.06%) రికార్డును ఆయన అధిగమించారు. ఈ జాబితాలో ధోని(58.84%) అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత సచిన్(58.82%) కొనసాగుతున్నారు.
ఇదొక్కటే కాదు.. రూ. 26.75 కోట్లకు తగ్గట్టుగా.. ఓ వైపు కెప్టెన్సీ చేస్తూ, మరోవైపు కోహ్లీ వారసత్వాన్ని తీసుకుని కొత్త చేజ్ మాస్టర్ అవతారమెత్తాడు శ్రేయాస్ అయ్యర్. మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్(52)తో కలిపి 2023 నుంచి ఐపీఎల్‌లో 6సార్లు చేజింగ్ చేస్తూ నాటౌట్‌గా నిలిచాడు. ఇక శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండు విజయాలు అందుకుంది. ఈ జట్టులో ఎక్కువ మంది స్వదేశీ ఆటగాళ్ళే ఉండటం విశేషం. ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, నేహళ్ వధేరా, శశాంక్ సింగ్ బ్యాటింగ్‌లో రాణిస్తూ.. జట్టుకు అద్భుత విజయాలు అందిస్తున్నారు. అటు పంజాబ్ బెంచ్ కూడా స్ట్రాంగ్‌గా ఉండటం విశేషం.
మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్‌పై ఘన విజయం అందుకుని పంజాబ్ కింగ్స్ పాయింట్స్ పట్టికలో టాప్ 2లోకి దూసుకొచ్చింది. ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచి 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. అలాగే తమ నెట్ రన్‌రేట్‌ను కూడా స్ట్రాంగ్ చేసుకుంది. ఆర్సీబీ కూడా బ్యాక్ టూ బ్యాక్ విజయాలతో టాప్‌లో కొనసాగుతోంది. ఇక మూడో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. కాగా,. ఈ మూడు జట్లు ఇప్పటివరకూ జరిగిన 18 సీజన్లలో ట్రోఫీ గెలవలేకపోయాయి.
𝑷𝒖𝒏𝒕𝒆𝒓 𝒊𝒔 𝒐𝒏𝒄𝒆 𝒂𝒈𝒂𝒊𝒏 𝒑𝒓𝒐𝒖𝒅 𝒐𝒇 𝒕𝒉𝒆 🦁s! 👏#LSGvPBKS #IPL2025 #BasJeetnaHai #PunjabKings pic.twitter.com/Rt3Xi1AtHl
— Punjab Kings (@PunjabKingsIPL) April 2, 2025