Virat Kohli: టీ20 ప్రపంచకప్‌లో ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ.! నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు.!

|

Mar 22, 2021 | 3:52 PM

Virat Kohli In T20I: ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి..

Virat Kohli: టీ20 ప్రపంచకప్‌లో ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ.! నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు.!
విరాట్ కోహ్లీ
Follow us on

Virat Kohli In T20I: ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లోనే తాను ఐపీఎల్‌లో కూడా ఓపెనర్‌గా దిగబోతున్నట్లు కోహ్లీ వెల్లడించాడు.

టీ20 ప్రపంచకప్ దగ్గరలో ఉండటంతో.. కోహ్లీ ఓపెనర్‌గా దిగితే జట్టుకు ఎంతో ఉపయోగం ఉంటుందని.. ఓపెనింగ్ పెయిర్‌గా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పుతారని క్రికెట్ నిపుణులు అంటున్నారు. అయితే కొంతమంది మాజీ క్రికెటర్లు ఈ నిర్ణయం పట్ల విముఖతను వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ”టీమిండియా ఇప్పటికే అద్భుతమైన జట్టుగా అవతరించింది. రోహిత్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభించడం వల్ల పవర్‌ప్లేలో పరుగులు సాధించవచ్చు. అంతేకాకుండా విరాట్‌ సహకారంతో రోహిత్ శర్మ తనదైన శైలి షాట్స్‌తో స్వేచ్చగా ఆడగలడు” అని పేర్కొన్నాడు.

అయితే కోహ్లీ ఓపెనర్‌గా రావడం వల్ల ధావన్‌కు అవకాశాలు తగ్గుతాయని.. తుది జట్టులో చోటు దొరికే అవకాశం ఉండదని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరో మాజీ భారత సెలెక్టర్ దేవాంగ్ గాంధీ మాట్లాడుతూ ”కోహ్లీని ఓపెనర్‌గా పంపడం ద్వారా మిడిల్ ఆర్డర్‌లో ఇబ్బందులు వస్తాయని.. అనుభవం లేమి వల్ల టీం దెబ్బ తినే అవకాశం ఉందని పేర్కొన్నాడు. టీంను సమర్ధవంతంగా నడిపేందుకు కోహ్లీకి మూడో స్థానం సరైనది అని స్పష్టం చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!

భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!

తలపై కొమ్ముతో భయంకర ఆకారం.. బెంబేలెత్తించే దృశ్యం.. ఇంతకీ అది దెయ్యమేనా.!