AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket News: విరాట్‌ కోహ్లీ 45 ఏళ్ల పాటు ఆడుతాడు.. 110 సెంచరీలు చేస్తాడు.. ఎవరన్నారంటే..?

Cricket News:ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లిపై ప్రశ్నల వర్షం కురుస్తూనే ఉంది. అతడి ఫామ్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. విరాట్ కోహ్లీ కెరియర్‌

Cricket News: విరాట్‌ కోహ్లీ 45 ఏళ్ల పాటు ఆడుతాడు.. 110 సెంచరీలు చేస్తాడు.. ఎవరన్నారంటే..?
Virat Kohli
uppula Raju
|

Updated on: Jun 01, 2022 | 6:20 AM

Share

Cricket News:ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లిపై ప్రశ్నల వర్షం కురుస్తూనే ఉంది. అతడి ఫామ్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. విరాట్ కోహ్లీ కెరియర్‌ ముగిసినట్లేనా అనే మాటలు వినిపిస్తున్నాయి. రెండున్నరేళ్లకు పైగా సెంచరీ చేయలేకపోయిన విరాట్ కోహ్లీ సచిన్ 100 సెంచరీల రికార్డును బద్దలు కొట్టగలడా లేదా అనే ప్రశ్న క్రికెట్‌ అభిమానులందరిలో మెదులుతోంది. అయితే ఇన్ని ప్రశ్నల మధ్య పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఓ పెద్ద విషయం చెప్పాడు. విరాట్ కోహ్లీని ప్రశ్నించే వ్యక్తులు కాస్త జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలని సూచించాడు. విరాట్ కోహ్లి కచ్చితంగా 100 సెంచరీల మార్క్‌ను అందుకుంటాడని పేర్కొన్నాడు.

ఓ స్పోర్ట్స్‌ ఛానెల్‌తో జరిగిన సంభాషణలో షోయబ్ మాట్లాడుతూ ‘ ఏ విషయం గురించైనా మాట్లాడేముందు ఒక్కసారి ఆలోచించాలి. ఒక పాకిస్థానీగా నేను విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్‌లలో ఒకడని చెబుతున్నాను. అతను అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు సాధించాలని కోరుకుంటున్నా. అతను 45 ఏళ్ల వరకు ఆడాలని కోరుకుంటున్నాను’ అన్నాడు.

అలాగే ‘విరాట్‌ కోహ్లీ ఇప్పుడు తనేంటో ప్రజలకు చూపించాల్సిన సమయం వచ్చింది.. ప్రజలు మీకు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు. మీ భార్య, బిడ్డ గురించి ట్వీట్ చేస్తున్నారు. ప్రపంచకప్‌లో ఓడిపోయిన తర్వాత మీరు విమర్శలకుగురవుతున్నారు. ఇప్పుడు ఇంతకంటే దారుణం ఏమీ ఉండదు. నువ్వేమిటో వారికి చూపించు’ అన్నాడు.

ఇవి కూడా చదవండి

ఒకప్పుడు ఐపీఎల్ సీజన్‌లో 973 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఇప్పుడు హాఫ్ సెంచరీ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. విరాట్ కోహ్లీ ఈ ఏడాది 16 మ్యాచ్‌లు ఆడి 22.73 సగటుతో 341 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 115.99. విరాట్ బ్యాట్ నుంచి రెండు అర్ధ సెంచరీలు వచ్చాయి. అంతేకాదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి టైటిల్‌ను చేజార్చుకునే అవకాశాన్ని కోల్పోయింది. ప్లేఆఫ్‌కు చేరుకుంది కానీ ఫైనల్స్‌కు చేరుకోలేకపోయింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి