నిన్నటి మ్యాచ్‌లో ఇది గమనించారా.. కోహ్లీ సెంచరీని అడ్డుకునేందుకు షాహీన్ భారీ కుట్ర.. ఏకిపారేస్తోన్న ఫ్యాన్స్

Shaheen Afridi vs Virat Kohli: ఎంతగానో ఎదురుచూసిన భారత్ వర్సెస్ పాక్ మ్యచా్ పూర్తయింది. ఎట్టకేలకు 8 ఏళ్ల పగను టీమిండియా వడ్డీతో సహా తీర్చుకుంది. విరాట్ కోహ్లీ సెంచరీతో టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ క్రమంలో పాక్ బౌలర్ షాహీన్ కోహ్లీ సెంచరీ చేయకుండా పదే పదే వైడ్లు వేసి, కుట్ర పన్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు.

నిన్నటి మ్యాచ్‌లో ఇది గమనించారా.. కోహ్లీ సెంచరీని అడ్డుకునేందుకు షాహీన్ భారీ కుట్ర.. ఏకిపారేస్తోన్న ఫ్యాన్స్
Virat Kohli Vs Shaheen Afri

Updated on: Feb 24, 2025 | 4:53 PM

India vs Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు తన బలమైన ప్రదర్శనను కొనసాగించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో, టీం ఇండియా తన రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయానికి హీరో విరాట్ కోహ్లీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతను 111 బంతుల్లో అజేయంగా 100 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ సెంచరీని ఆపడానికి షాహీన్ అఫ్రిది తన వంతు ప్రయత్నం చేశాడంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఆ సమయంలో షాషీన్ దుర్మార్గంగా ఆలోచించాడంటూ అభిమానులు అతని క్రీడా స్ఫూర్తిని ప్రశ్నిస్తున్నారు.

41 ఓవర్ల తర్వాత, భారత జట్టు గెలవడానికి 17 పరుగులు అవసరం. అదే సమయంలో, కోహ్లీ తన సెంచరీ పూర్తి చేయడానికి 13 పరుగులు అవసరం. పాకిస్తాన్ తరపున షాహీన్ అఫ్రిది 42వ ఓవర్ వేశాడు. కోహ్లీ తన సెంచరీని పూర్తి చేయకుండా నిరోధించడానికి, అఫ్రిది వైడ్ బాల్స్ వేసి అదనపు పరుగులు ఇచ్చాడంట. స్టేడియంలో ఉన్న అభిమానులు అఫ్రిది చర్యతో కోపంగా కనిపించారు. ఈ చర్య కారణంగా షాహీన్ అఫ్రిదిని సోషల్ మీడియాలో కూడా టార్గెట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

షాహీన్ అఫ్రిదిపై వచ్చిన కామెంట్లు ఓసారి చూద్దాం..

(షహీన్ అఫ్రిది ఆట స్ఫూర్తికి వ్యతిరేకంగా ఆడాడు. కోహ్లీకి వరుసగా 2 వైడ్‌లు బౌలింగ్ చేశాడు. ఇది అతని సెంచరీని పూర్తి చేయకుండా నిరోధించింది. చాలా అసహ్యకరమైనది అంటూ కామెట్లు చేశారు.)

కోహ్లీ సెంచరీని ఆపడానికి షాహీన్ అఫ్రిది తన శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ, అతను విఫలమయ్యాడు. 43వ ఓవర్ మూడో బంతికి కోహ్లీ ఫోర్ కొట్టి తన సెంచరీ పూర్తి చేసి, భారత్ 6 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలవడానికి సహాయం చేశాడు. ఈ విజయంతో, భారతదేశం సెమీ-ఫైనల్స్‌లో తన స్థానాన్ని దాదాపుగా నిర్ధారించుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..