Video: 10 ఫోర్లు, 4 సిక్సులు.. 186 స్ట్రైక్‌రేట్‌తో లేడీ సెహ్వాగ్ బీభత్సం.. తొలి హాఫ్ సెంచరీతో 7గురు బౌలర్లపై ఊచకోత..
Shafali Verma: షెఫాలీ వర్మ తన మొదటి WPL మ్యాచ్‌లోనే అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లను చిత్తు చేసింది.
మహిళల క్రికెట్‌లో షెఫాలీ వర్మ తన బ్యాటింగ్‌తో దూసుకుపోతుంది. ఆమె ఎప్పుడు బరిలోకి దిగినా బౌలర్లు భయపడుతూనే ఉంటుంటారు. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో కూడా షెఫాలీ తన తుఫాను శైలిని ప్రదర్శించింది. షెఫాలీ డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతోంది. ఈ లీగ్‌లో ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢిల్లీ జట్టు తన తొలి మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో షెఫాలీ తన బ్యాట్‌తో సత్తాను చాటింది. ఈ మ్యాచ్‌లో ఆమె హాఫ్ సెంచరీ సాధించింది.
ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు వచ్చిన షెఫాలీ.. రాగానే తన తుఫాన్ శైలిని ప్రదర్శించింది. కెప్టెన్ మెగ్ లానింగ్‌తో కలిసి బౌలర్లను చితక్కొట్టారు. సెంచరీ భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఇది తొలి సెంచరీ భాగస్వామ్యం.. వీరిద్దరూ తొలి వికెట్‌కు 162 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
రెండో ఓవర్ నుంచే దూకుడు..
6️⃣4️⃣6️⃣ @TheShafaliVerma is dealing in boundaries here in Mumbai ??
Follow the match ▶️ https://t.co/593BI7xKRy#TATAWPL | #RCBvDC pic.twitter.com/vXl5rOEgSh
— Women’s Premier League (WPL) (@wplt20) March 5, 2023
షెఫాలీ తన ఉద్దేశాన్ని రెండో ఓవర్‌లోనే చెప్పుకొచ్చింది. మెగాన్ షట్ వేసిన ఈ ఓవర్ మూడో బంతినే ఫోర్ బాదింది. ఆ తర్వాత ఐదో బంతికి ఫోర్ బాదాడు. చివరి బంతికి కూడా ఫోర్ కొట్టింది. నాలుగో ఓవర్ తొలి బంతికి ప్రీతీ బోస్‌పై తొలి సిక్స్ కొట్టింది. ఇక్కడి నుంచి ఆగకుండా తన తుఫాను స్టైల్‌ని ప్రదర్శించింది. ఆమె 31 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసింది. WPLలో అర్ధ సెంచరీ చేసిన రెండవ క్రీడాకారిణిగా నిలిచింది. చివరకు 45 బతుల్లోనే 84 పరుగులు చేసి వికెట్ కోల్పోయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..