AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virender Sehwag : టీ పెట్టడం ఎంత సింపులో.. కోహ్లీకి రన్స్ కొట్టడం అంతే ఈజీ.. సెహ్వాగ్ కామెంట్స్ వైరల్

సౌతాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ సాధించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కోహ్లీ తన కెరీర్‌లో 52వ అంతర్జాతీయ సెంచరీని నమోదు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా అతని అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా వీరేంద్ర సెహ్వాగ్ చేసిన కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Virender Sehwag : టీ పెట్టడం ఎంత సింపులో.. కోహ్లీకి రన్స్ కొట్టడం అంతే ఈజీ.. సెహ్వాగ్ కామెంట్స్ వైరల్
Sehwag Reaction Virat Kohli
Rakesh
|

Updated on: Dec 01, 2025 | 6:07 PM

Share

Virender Sehwag : సౌతాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ సాధించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కోహ్లీ తన కెరీర్‌లో 52వ అంతర్జాతీయ సెంచరీని నమోదు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా అతని అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా వీరేంద్ర సెహ్వాగ్ చేసిన కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. “మనకు టీ పెట్టడం ఎంత సులభమో, కోహ్లీకి పరుగులు చేయడం అంతే సులభం” అంటూ సెహ్వాగ్ చేసిన వ్యాఖ్య కోహ్లీ స్థిరత్వానికి అద్దం పట్టింది. ఈ సెంచరీపై ఇతర భారత దిగ్గజాలు ఎలా స్పందించారో ఇప్పుడు చూద్దాం.

మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన స్టైల్‌లో కోహ్లీని ప్రశంసించారు. సెహ్వాగ్ మాట్లాడుతూ “మనకు ఇంట్లో టీ తయారుచేయడం ఎంత సులభమో, విరాట్ కోహ్లీకి పరుగులు చేయడం కూడా అంతే సులభం” అని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్ ద్వారా కోహ్లీ పరుగుల స్థిరత్వం అద్భుతమైన స్థాయిని సెహ్వాగ్ ప్రపంచానికి మరోసారి తెలియజేశారు.

కోహ్లీ మాజీ సహచర ఆటగాళ్లు శిఖర్ ధావన్, ఇర్ఫాన్ పఠాన్ కూడా విరాట్ ఇన్నింగ్స్‌పై స్పందించారు. భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. “విరాట్ కోహ్లీకి ఇది మరో అద్భుతమైన రోజు. 52వ సెంచరీ సాధించాడు, కానీ ఇప్పటికీ స్థిరత్వానికి, పరుగుల దాహానికి కొత్త ప్రమాణాలను సెట్ చేస్తూనే ఉన్నాడు. చాలా అద్భుతమైన ఇన్నింగ్స్” అని కొనియాడారు.

భారత మాజీ పేస్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. “విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టిన తర్వాత అతని సెలబ్రేషన్ చూస్తేనే అర్థమవుతుంది. ఆ ఇన్నింగ్స్ అతనికి ఎంత ముఖ్యమైనదో” అని వ్యాఖ్యానించారు. ఈ సెంచరీ కోహ్లీపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పిందని ఆయన పరోక్షంగా సూచించారు. మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప, ప్రస్తుతం భారత జట్టులో ఉన్న స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ కూడా విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనను అభినందించారు. కోహ్లీ ఆటతీరు ఎంత మెరుగ్గా ఉందో వారి సందేశాలు సూచిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..