AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardik Pandya : టీమిండియాకు బ్రేకింగ్ న్యూస్.. హార్దిక్ పాండ్యాకు గుడ్ న్యూస్.. సౌతాఫ్రికా టీ20 సిరీస్‌కు క్లియరెన్స్ వచ్చేసింది

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అభిమానులకు, జట్టు యాజమాన్యానికి ఒక శుభవార్త అందింది. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న పాండ్యా, ఇప్పుడు టీ20 ఇంటర్నేషనల్స్ ‎లో బౌలింగ్ చేయడానికి ఫిట్‌నెస్‌ను సాధించినట్లు బీసీసీఐ ధృవీకరించింది. నేషనల్ క్రికెట్ అకాడమీలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‎లో ఇంటెన్సివ్ రిహాబిలిటేషన్ పూర్తి చేసిన తర్వాత, సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్‌కు ముందు అతని రీఎంట్రీ పై క్లియరెన్స్ లభించింది.

Hardik Pandya : టీమిండియాకు బ్రేకింగ్ న్యూస్.. హార్దిక్ పాండ్యాకు గుడ్ న్యూస్.. సౌతాఫ్రికా టీ20 సిరీస్‌కు క్లియరెన్స్ వచ్చేసింది
Hardik Pandya (2)
Rakesh
|

Updated on: Dec 01, 2025 | 6:39 PM

Share

Hardik Pandya : టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అభిమానులకు, జట్టు యాజమాన్యానికి ఒక శుభవార్త అందింది. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న పాండ్యా, ఇప్పుడు టీ20 ఇంటర్నేషనల్స్ ‎లో బౌలింగ్ చేయడానికి ఫిట్‌నెస్‌ను సాధించినట్లు బీసీసీఐ ధృవీకరించింది. నేషనల్ క్రికెట్ అకాడమీలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‎లో ఇంటెన్సివ్ రిహాబిలిటేషన్ పూర్తి చేసిన తర్వాత, సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్‌కు ముందు అతని రీఎంట్రీ పై క్లియరెన్స్ లభించింది. ఆసియా కప్ 2025 సెమీ-ఫైనల్‌లో గాయపడిన హార్దిక్, ఈ అనుమతితో జట్టుకు తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‎లో తన రిహాబిలిటేషన్ ‎ను విజయవంతంగా పూర్తి చేశాడు. పీటీఐ నివేదిక ప్రకారం, అక్టోబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు హార్దిక్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‎లో రిటర్న్ టు ప్లే ప్రోటోకాల్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. సెప్టెంబర్‌లో ఆసియా కప్ సమయంలో పాండ్యాకు ఎడమ తొడ కండరంలో గాయం కావడంతో అతను ఆస్ట్రేలియా సిరీస్, ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడంతో, అతన్ని టీ20 మ్యాచ్‌లలో బౌలింగ్ చేయడానికి ఫిట్‌గా ప్రకటించారు. ఇది సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు చాలా పెద్ద సానుకూల అంశం.

టీ20లలో బౌలింగ్ చేయడానికి హార్దిక్‌కు అనుమతి లభించినప్పటికీ, అతని వర్క్‌లోడ్‌ను పూర్తిగా పరీక్షించడానికి, అతన్ని నేరుగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు పంపకుండా ముందుగా దేశవాళీ క్రికెట్‌లో ఆడించాలని బీసీసీఐ నిర్ణయించింది. రీఎంట్రీ వేదికగా సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీని ఎంచుకున్నారు. హార్దిక్ తన సొంత జట్టు బరోడా తరఫున ఆడనున్నాడు. అతను డిసెంబర్ 2న పంజాబ్‌తో, డిసెంబర్ 4న గుజరాత్‌తో మ్యాచ్‌లు ఆడవచ్చు. ఈ రెండు మ్యాచ్‌లలో వరుసగా బౌలింగ్ చేసిన తర్వాత అతని శరీరం ఎలా స్పందిస్తుందో నిశితంగా పర్యవేక్షించడం బీసీసీఐ లక్ష్యం.

హార్దిక్ పాండ్యాను ఇకపై టీ20 ఫార్మాట్‌లో మాత్రమే జాగ్రత్తగా నిర్వహించాలని బీసీసీఐ గతంలోనే సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అతని దేశవాళీ టోర్నమెంట్ ప్రదర్శనను నిశితంగా పరిశీలించి, జట్టు యాజమాన్యం, సెలెక్టర్లకు ఫీడ్‌బ్యాక్ ఇచ్చే బాధ్యతను నేషనల్ సెలక్షన్ కమిటీ సభ్యుడు ప్రజ్ఞాన్ ఓజాకు అప్పగించారు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో కూడా కీలకమైన పాత్ర పోషించే హార్దిక్‌ను, ముఖ్యంగా 2026 టీ20 ప్రపంచ కప్ లో కీలక ఆటగాడిగా మేనేజ్‌మెంట్ చూస్తోంది. కాబట్టి సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో అతని ప్రదర్శన అత్యంత ముఖ్యమైనది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..