28 ఇన్నింగ్స్‌ల్లో 9 సెంచరీలు.. 3 వేలకుపైగా పరుగులు.. ఈ మాజీ కోహ్లీ టీమ్‌మేట్‌కు చోటు దక్కేనా!

దేశం తరపున ఆడాలనేది ప్రతి ఆటగాడి కల. టీమిండియా జెర్సీలో తనను తాను చూసుకోవాలన్నది మన దేశీయ యువ ప్లేయర్స్ కోరిక.

28 ఇన్నింగ్స్‌ల్లో 9 సెంచరీలు.. 3 వేలకుపైగా పరుగులు.. ఈ మాజీ కోహ్లీ టీమ్‌మేట్‌కు చోటు దక్కేనా!
Cricket
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 04, 2023 | 9:05 PM

దేశం తరపున ఆడాలనేది ప్రతి ఆటగాడి కల. టీమిండియా జెర్సీలో తనను తాను చూసుకోవాలన్నది మన దేశీయ యువ ప్లేయర్స్ కోరిక. దీని కోసం వారంతా కూడా డొమెస్టిక్ టోర్నమెంట్స్‌లో మెరుగ్గా రాణిస్తుంటారు. ఎంత రాణించినా కూడా కొంతమంది ప్లేయర్స్‌కు మాత్రం టీమిండియా జాతీయ జట్టులో చోటు దక్కదు. ఆ కోవకు చెందిన ప్లేయరే ఇతడు. అతడెవరో కాదు సర్ఫరాజ్ ఖాన్. ఈ యువ ప్లేయర్ ఇప్పుడు రంజీ ట్రోఫీలో ముంబై జట్టు తరపున పరుగుల వరద పారిస్తున్నాడు.

ఈ 25 ఏళ్ల యువ ప్లేయర్ రంజీ ట్రోఫీలో తమిళనాడుతో ఆడిన మ్యాచ్‌లో అద్భుత సెంచరీ సాధించాడు. 50వ ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్‌లో అతడి బ్యాట్ నుంచి వచ్చిన 12వ సెంచరీ ఇది. ఇక రంజీల్లో ముంబై తరపున ఆడిన సర్ఫరాజ్ చివరి 28 ఇన్నింగ్స్‌ల్లో 15 సార్లు భారీ స్కోర్లు సాధించాడు. అంతేకాదు ఈ సమయంలో 9 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక ఓవరాల్‌గా సర్ఫరాజ్ ఇప్పటివరకు 50 ఇన్నింగ్స్‌లలో 12 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు సాధించాడు. అదే సమయంలో, అతడు 77 కంటే ఎక్కువ సగటుతో 3 వేల కంటే ఎక్కువ పరుగులు చేశాడు.

టీమిండియాలో చోటు దక్కేనా..?

దేశవాళీ క్రికెట్‌లో సర్ఫరాజ్ ఖాన్ మ్యాచ్‌లవారీగా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో గత 3 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, చివరి 28 ఇన్నింగ్స్‌ల్లో 9 సెంచరీలు, 50 ఇన్నింగ్స్‌ల్లో 12 సెంచరీలు చేయడమే దీనికి ఉదాహరణ. అయితే ఇంతలా మంచి పెర్ఫార్మన్స్‌లు ఇస్తున్నప్పటికీ.. ఇంకా సర్ఫరాజ్‌కు టీమిండియా నుంచి పిలుపు రాలేదు.