వరుసగా 16 ఓవర్ల బౌలింగ్.. యార్కర్లతో ఊచకోత.. కట్ చేస్తే.. 28 పరుగులిచ్చి 7 వికెట్లు.. ఎవరో తెలుసా?
పంజాబ్ ఫాస్ట్ బౌలర్ బల్తేజ్ సింగ్ రంజీ ట్రోఫీలో అద్భుతమైన బౌలింగ్‌తో అదరగొడుతున్నాడు. అతడి పదునైన యార్కర్ల ధాటికి..
పంజాబ్ ఫాస్ట్ బౌలర్ బల్తేజ్ సింగ్ రంజీ ట్రోఫీలో అద్భుతమైన బౌలింగ్‌తో అదరగొడుతున్నాడు. అతడి పదునైన యార్కర్ల ధాటికి ప్రత్యర్ధి గుజరాత్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. గుజరాత్‌పై బల్తేజ్ సింగ్ కేవలం 28 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ గుజరాత్ టాప్ ఆర్డర్ వరుస 7గురి బ్యాటర్లను ఔట్ చేయడం గమనార్హం.
ఇక బౌలర్ బల్తేజ్ సింగ్ కెరీర్ గురించి మాట్లాడుకుంటే.. ఈ ఫాస్ట్ బౌలర్ 11 సంవత్సరాల క్రితం ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆనాడు తొలి మ్యాచ్ ఆడినప్పటికీ.. ఇప్పటిదాకా ఇతడు ఆడింది కేవలం 22 మ్యాచ్‌లు.. వరుస గాయాలు బల్తేజ్ కెరీర్‌పై బాగా ప్రభావం చూపించాయి. 2015లో గాయపడిన బల్తేజ్.. కోలుకున్న అనంతరం MRF పేస్ అకాడమీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అతడి బౌలింగ్ వేగం తగ్గగా.. ఆస్ట్రేలియా వెటరన్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ బల్తేజ్ సాయం అందించాడు.
బల్తేజ్‌ను పేస్‌కు బదులుగా లెంగ్త్, బౌన్స్‌పై దృష్టి సారించాలని మెక్‌గ్రాత్‌కు సలహా ఇచ్చాడు. బల్తేజ్ కూడా అటువైపే ఏకాగ్రత పెట్టడంతో.. ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. తన పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్ధులను బెదరగొడుతున్నాడు. కాగా, బల్తేజ్ ప్రస్తుతం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అటు ప్రస్తుతం గుజరాత్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో బల్తేజ్ సింగ్ తొలి ఇన్నింగ్స్‌లో వరుసగా 16 ఓవర్లు వేసి.. 28 పరుగులకు 7 వికెట్లు పడగొట్టాడు.