AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanju Samson : చెపాక్‌లో సంజు శాంసన్ విధ్వంసం.. తొలి సెంచరీతో చెన్నైకి గ్రాండ్ విక్టరీ.. రజినీకాంత్ స్టైల్లో సెలబ్రేషన్

Sanju Samson : వరుసగా మూడు ఓటములతో డీలా పడ్డ జట్టుకు ఊపిరి పోస్తూ, సంజు శామ్సన్ చెపాక్ స్టేడియంలో శివతాండవం చేశాడు. కేవలం 56 బంతుల్లో 115 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నైకి ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందించాడు.

Sanju Samson : చెపాక్‌లో సంజు శాంసన్ విధ్వంసం.. తొలి సెంచరీతో చెన్నైకి గ్రాండ్ విక్టరీ.. రజినీకాంత్ స్టైల్లో సెలబ్రేషన్
Sanju Samson
Rakesh
|

Updated on: Apr 12, 2026 | 11:29 AM

Share

Sanju Samson : ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ మరుపురాని క్షణం రానే వచ్చింది. వరుసగా మూడు ఓటములతో డీలా పడ్డ జట్టుకు ఊపిరి పోస్తూ, సంజు శామ్సన్ చెపాక్ స్టేడియంలో శివతాండవం చేశాడు. కేవలం 56 బంతుల్లో 115 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నైకి ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందించాడు. సెంచరీ తర్వాత సంజు చేసిన నరసింహ స్టైల్ సెలబ్రేషన్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుత సెంచరీ బాదిన తర్వాత సంజు శాంసన్ తన సంతోషాన్ని పంచుకున్నాడు. తాను చేసిన నరసింహ సినిమా స్టైల్ సెలబ్రేషన్ (రజినీకాంత్ స్టైల్ సెల్యూట్) కేవలం అభిమానుల కోసమే కాదు, జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కోసం అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. “ఒక ఫ్రాంచైజీని నడిపించడం ఎంత కష్టమో నాకు తెలుసు. గత ఐదేళ్లుగా నేను కూడా ఒక టీమ్‌ను లీడ్ చేశాను. వరుసగా మూడు ఓటములు ఎదురైనప్పుడు కోచ్ పడే మానసిక వేదనను నేను అర్థం చేసుకోగలను. అందుకే ఈ విజయాన్ని, ఈ సెంచరీని మా కోచ్‌కు అంకితం ఇస్తున్నాను” అని సంజు భావోద్వేగంతో అన్నాడు.

సాధారణంగా జట్టు వరుసగా ఓడిపోతే గంటల కొద్దీ విశ్లేషణలు, మీటింగ్‌లు జరుగుతుంటాయి. కానీ చెన్నై సూపర్ కింగ్స్ తీరే వేరని సంజు గుర్తు చేశాడు. “వరుసగా మూడు మ్యాచులు ఓడిపోయినా మా టీమ్ చాలా ప్రశాంతంగా ఉంది. ఇవాళ మ్యాచ్‌కు ముందు కేవలం 50 సెకన్ల పాటు టీమ్ మీటింగ్ జరిగింది. ఆ చిన్న సంభాషణలోనే మాకు కావాల్సిన స్పష్టత వచ్చేసింది. ఈ ఫ్రాంచైజీకి ఉన్న గొప్పతనమే అది. అందుకే నేను ఇక్కడ చాలా త్వరగా కలిసిపోయాను” అని సంజు చెప్పుకొచ్చాడు. ఈ ప్రశాంతతే తనను స్వేచ్ఛగా ఆడేలా చేసిందని తెలిపాడు.

తన ఫామ్ గురించి సంజు చాలా నిజాయితీగా మాట్లాడాడు. “నేను నా కెరీర్‌లో చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. కానీ ఆ ఓటములే నన్ను ఎలా తిరిగి రావాలో నేర్పించాయి. నాకు ఇప్పుడు 31 ఏళ్లు, క్రికెట్‌లో చాలా సమయం గడిపాను. నా ప్రాథమిక సూత్రాలు ఏంటో నాకు తెలుసు. మ్యాచ్‌కు ముందు రోజు సపోర్ట్ స్టాఫ్ నన్ను తిరిగి ఫోకస్ అయ్యేలా చేశారు. ఆ సహకారం వల్లే నేను నేడు ఈ స్థాయిలో ఆడగలిగాను” అని వివరించాడు. తనతో పాటు ఆడిన యువ ఆటగాడు ఆయుష్ మాత్రే పరిణతిని కూడా సంజు మెచ్చుకున్నాడు.

సిఎస్‌కె కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఈ గెలుపుపై ఆనందం వ్యక్తం చేశాడు. తాము సరైన సమయంలో పుంజుకున్నామని, ముఖ్యంగా బౌలర్లు అగ్రెసివ్ లెంగ్త్స్ వేసి ఢిల్లీని దెబ్బకొట్టారని చెప్పాడు. జట్టులో ఎక్స్‌ఫ్యాక్టర్ బౌలర్లు లేకపోయినా, పక్కా ప్లానింగ్‌తో బౌండరీలను నియంత్రించగలిగామని అన్నాడు. అన్నిటికంటే మిన్నగా చెపాక్ అభిమానులు తమ వెంటే ఉండి ప్రోత్సహించడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని రుతురాజ్ కొనియాడాడు. సంజు శాంసన్ రూపంలో ధోనీ లేని లోటును భర్తీ చేసే ఒక అద్భుతమైన ఫినిషర్ దొరికాడని చెన్నై ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!