Team India: గంభీర్ జట్టు నుంచి గెంటేశాడు.. కట్ చేస్తే.. 99 బంతుల్లో అన్‌లక్కీ ప్లేయర్ అరాచకం
టీ20 జట్టులో పనికిరాడని అన్నారు.. అలాగే వన్డేలకు కూడా సెలెక్ట్ చేయలేదు. కట్ చేస్తే.. డొమెస్టిక్ క్రికెట్‌లో మరోసారి ఊచకోత కోసి.. తాను ఏంటో నిరూపించుకున్నాడు. సెలెక్టర్లకు గట్టిగా రిప్లై ఇచ్చాడు. మరి ఆ ప్లేయర్ ఎవరంటే.? ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

వన్డే జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్.. ఇటీవల ప్రారంభమైన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతమైన అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. తన సహచర బ్యాటర్ రోహన్ కున్నుమ్మల్‌తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వివరాల్లోకి వెళ్తే.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భారత స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్, అతడి సహచర ఆటగాడు రోహన్ కున్నుమ్మల్ ఒడిశా బౌలర్లను చిత్తు చేశారు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్లు 16.3 ఓవర్లలో 177 పరుగులు చేసి, తమ జట్టుకు 10 వికెట్ల విజయాన్ని అందించారు. లక్నోలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఒడిశా జట్టు 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. ఇక 177 పరుగుల టార్గెట్ చేధనలో బరిలోకి దిగిన కేరళకు.. ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. సంజూ శాంసన్ అజేయంగా 51 పరుగులు చేయగా, అతని సహచర ఆటగాడు రోహన్ కున్నుమ్మల్ కేవలం 60 బంతుల్లో 121 పరుగులు సాధించాడు. ఈ తరుణంలో ఇద్దరూ కలిసి 16 ఫోర్లు, 11 సిక్సర్లు బాదేశారు. కేరళ జట్టు కేవలం 99 బంతుల్లోనే మ్యాచ్ గెలవడం గమనార్హం.
వన్డేల నుంచి శాంసన్ అవుట్..
మరో రెండు రోజుల్లో దక్షిణాఫ్రికాతో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు సంజూ శాంసన్‌ను పక్కనపెట్టింది బీసీసీఐ. అలాగే టీ20 సిరీస్‌కు కూడా శాంసన్‌ను పక్కనపెట్టి.. మెయిన్ వికెట్ కీపర్‌గా జితీష్ శర్మను తీసుకుంటారని టాక్ నడుస్తోంది. అటు వన్డేలు, ఇటు టీ20ల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు ఇచ్చి.. తన సత్తా నిరూపించుకుంటున్నప్పటికీ.. సంజూ శాంసన్‌ను పక్కనపెడుతోంది బీసీసీఐ. అయితే డొమెస్టిక్ క్రికెట్‌లో మళ్లీ తన సత్తా చాటుతున్నాడు శాంసన్.
