AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanju Samson: నా సక్సెస్ వెనుక ‘సచిన్’ మంత్రం.. సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Sachin Tendulkar advice to Sanju Samson: 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన తీరు అద్భుతం. సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజం సలహాలు ఒక ఆటగాడి కెరీర్‌ను ఎలా మారుస్తాయో చెప్పడానికి ఈ ఇన్నింగ్సే నిదర్శనం.

Sanju Samson: నా సక్సెస్ వెనుక 'సచిన్' మంత్రం.. సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Ind Vs Nz Sanju Samson
Venkata Chari
|

Updated on: Mar 08, 2026 | 11:52 PM

Share

Sachin Tendulkar advice to Sanju Samson: 2026 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సగర్వంగా మువ్వన్నెల జెండాను ఎగురవేసింది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల భారీ తేడాతో గెలిచి భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ టోర్నీలో భారత్ తరపున వెలుగులీనిన ధృవతార సంజూ శాంసన్. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 80కి పైగా పరుగులు సాధించి, ఫైనల్‌లో కేవలం 46 బంతుల్లో 89 పరుగులు చేసిన సంజూను ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ వరించింది.

సచిన్ సలహాతోనే ఈ మార్పు..

మ్యాచ్ అనంతరం తన అద్భుత ఫామ్ గురించి సంజూ శాంసన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన బ్యాటింగ్‌లో నిలకడ లేదనే విమర్శలకు చెక్ పెట్టడానికి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సలహాలే కారణమని వెల్లడించాడు. ఈ క్రమంలో శాంసన్ మాట్లాడుతూ..

టోర్నీకి ముందు నేను మానసికంగా కొంత ఒత్తిడిలో ఉన్నాను. ఆ సమయంలో సచిన్ సార్‌కు ఫోన్ చేశాను. ఆయన నా బ్యాటింగ్ పొజిషన్, మెంటల్ అప్రోచ్ గురించి కొన్ని విలువైన సూచనలు చేశారు. బంతిని చూసి సహజ సిద్ధంగా ఆడమని ఆయన చెప్పిన మాటలు నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి,” అని సంజూ పేర్కొన్నాడు.

నిలకడకు మారుపేరుగా..

గతంలో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి వెంటనే అవుట్ అయ్యే సంజూ, ఈ టోర్నీలో మాత్రం బాధ్యతాయుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఫైనల్‌లో న్యూజిలాండ్ బౌలర్లను ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూనే, ఇన్నింగ్స్‌ను చక్కగా నిర్మించాడు. ఫలితంగా భారత్ భారీ స్కోరు సాధించి, కివీస్‌ను కట్టడి చేయగలిగింది.

సచిన్ మార్గదర్శకత్వం, సంజూ ప్రతిభ తోడవ్వడంతో టీమిండియా మరో ఐసీసీ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us