IPL 2024: అంకుల్ మీరు ఇక మారరా! ఢిల్లీపై ఓటమితో పంత్ కి వార్నింగ్ ఇచ్చిన LSG ఓనర్?

ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్‌లో ఓడిపోవడంతో యాజమాని సంజీవ్ గోయెంకా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కెప్టెన్ రిషబ్ పంత్‌తో పాటు కోచ్ జస్టిన్ లాంగర్‌తో కూడా సీరియస్‌గా మాట్లాడినట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై ఒత్తిడి పెంచిన గోయెంకా, ఇప్పుడు పంత్‌ను కూడా అదే పరిస్థితిలోకి నెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. యాజమాన్యం తరచుగా ఆటగాళ్లపై ఒత్తిడి పెంచడం వల్ల జట్టు విజయం సాధించలేకపోతుందనే అభిప్రాయం నెటిజన్లలో వ్యక్తమవుతోంది.

IPL 2024: అంకుల్ మీరు ఇక మారరా! ఢిల్లీపై ఓటమితో పంత్ కి వార్నింగ్ ఇచ్చిన LSG ఓనర్?
Rishabh Pant Lsg Owner

Updated on: Mar 25, 2025 | 3:12 PM

ఐపీఎల్‌లో ఆటగాళ్లు ఎంత ప్రెజర్‌లో ఉంటారో అందరికీ తెలిసిందే. కానీ ఒక్కో ఫ్రాంచైజీ యాజమాన్యం వారి టీమ్‌ను ఎలా హ్యాండిల్ చేస్తుందనేది కీలకం. కొన్ని జట్లు తమ ఆటగాళ్లపై పూర్తి నమ్మకం ఉంచి ప్రోత్సహిస్తే, మరికొన్ని ఫ్రాంచైజీలు ఓటమిని జీర్ణించుకోలేక ఆటగాళ్లపై ఒత్తిడి పెంచుతాయి. లక్నో సూపర్ జెయింట్స్ యాజమాని సంజీవ్ గోయెంకా రెండో వర్గంలోకే వస్తారు. గత సీజన్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై అసంతృప్తిగా ఉన్న గోయెంకా, ఈసారి అదే పరిస్థితిని రిషబ్ పంత్‌కు తీసుకువచ్చారని చెప్పుకుంటున్నారు.

ఓటమితో యాజమాని అసహనం

లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్‌ను ఓటమితో ప్రారంభించింది. తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 1 వికెట్ తేడాతో పరాజయం పాలైంది. అయితే ఆ మ్యాచ్‌లో గెలుపు చివరి వరకు లక్నో వైపే ఉంది. కానీ అశుతోష్ శర్మ (31 బంతుల్లో 66 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడడంతో గెలుపు ఢిల్లీకి చేజారింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేని లక్నో యజమాని సంజీవ్ గోయెంకా, కెప్టెన్ రిషబ్ పంత్‌ను పిలిచి సీరియస్‌గా మాట్లాడినట్లు వీడియోలు బయటకొచ్చాయి. అంతేకాదు, కోచ్ జస్టిన్ లాంగర్‌తో కూడా గంభీరంగా చర్చించినట్లు కనిపించింది.

గతంలా ఇప్పుడు కూడా?

గత సీజన్‌లో కూడా గోయెంకా టీమ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పట్లో కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై నేరుగా అసహనం వ్యక్తం చేస్తూ, అతన్ని పబ్లిక్‌గా విమర్శించారు. ఇప్పుడు అదే తీరు రిషబ్ పంత్ విషయంలోనూ కనబడుతుండటంతో లక్నో జట్టులో మళ్లీ అదే పరిస్థితి ఏర్పడనుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ యజమానిగా ఉన్నప్పుడు గోయెంకా ధోనీని కెప్టెన్సీ నుంచి తప్పించి స్టీవ్ స్మిత్‌ను నియమించిన విషయం కూడా గుర్తుచేస్తున్నారు.

యాజమాన్యం తీరు మారాలని సూచనలు

ఒక ఫ్రాంచైజీకి మంచి ఆటగాళ్లు, మంచి యాజమాన్యం రెండూ కీలకం. కానీ లక్నో యాజమాన్యం తరచుగా ఆటగాళ్లపై ఒత్తిడి పెంచడం వల్ల జట్టులో అసంతృప్తి పెరుగుతుందని అభిమానులు అంటున్నారు. కేవలం ఓటమికి ఒక ఆటగాళ్లను బాధ్యులుగా భావించకుండా, మేనేజ్‌మెంట్‌ సపోర్ట్ అవసరమని నెటిజన్లు సూచిస్తున్నారు. లక్నో యాజమాన్యం తమ తీరు మార్చుకోకపోతే, జట్టుకు మంచి ఫలితాలు రావడం కష్టమని అంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..