AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravichandran Ashiwn: వన్డే జట్టులోకి అశ్విన్ తిరిగి రావడం వింత.. సంజయ్ మంజ్రేకర్..

దక్షిణాఫ్రికా చేతిలో వన్డే సిరీస్‌లో భారత్ ఓటమి తర్వాత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(ravichandran ashiwn) ఆటతీరుపై భారత మాజీ బ్యాట్స్‌మెన్ సంజయ్ మంజ్రేకర్(sanjay manjrekar) విరుచుకుపడ్డాడు...

Ravichandran Ashiwn: వన్డే జట్టులోకి అశ్విన్ తిరిగి రావడం వింత.. సంజయ్ మంజ్రేకర్..
Sanjay
Srinivas Chekkilla
|

Updated on: Jan 24, 2022 | 10:45 PM

Share

దక్షిణాఫ్రికా చేతిలో వన్డే సిరీస్‌లో భారత్ ఓటమి తర్వాత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(ravichandran ashiwn) ఆటతీరుపై భారత మాజీ బ్యాట్స్‌మెన్ సంజయ్ మంజ్రేకర్(sanjay manjrekar) విరుచుకుపడ్డాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో అశ్విన్ ప్రదర్శనను విమర్శించిన అతను, అతను ఆడిన రెండు వన్డేలలో అశ్విన్ పెద్దగా రాణించలేదని చెప్పాడు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వన్డే జట్టులోకి వచ్చిన అశ్విన్ దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో మొదటి రెండు వన్డేలు ఆడాడు.తొలి వన్డేలో అశ్విన్ 53 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అలాగే బ్యాటింగ్‌తో ఏడు పరుగులు చేశాడు. రెండో వన్డేలో 10 ఓవర్లలో 68 పరుగులు ఇచ్చినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మూడో మ్యాచ్‌లో అతని స్థానంలో జయంత్ యాదవ్‌(Jayanth yadav)కు అవకాశం లభించింది. అయితే ఈ మ్యాచ్‌లోనూ భారత్‌ ఓటమిపాలైంది. మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 3-0తో భారత్‌ను ఓడించింది.

అశ్విన్ రాకతో జట్టుకు నష్టం వాటిల్లిందని మంజ్రేకర్ అన్నాడు. వన్డే జట్టులోకి అశ్విన్ తిరిగి రావడం కూడా వింతగా అభివర్ణించాడు. మంజ్రేకర్ అశ్విన్​నే కాదు యుజ్వేంద్ర చాహల్​ను కూడా వదిలిపెట్టలేదు. చాహల్ మూడు మ్యాచ్‌లు ఆడినప్పటికీ కేవలం రెండు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ‘“అశ్విన్ కొన్ని కారణాల వల్ల వింతగా ODI జట్టులోకి వచ్చాడు. దీని భారాన్ని భారత్ భరించాల్సి వచ్చింది. అతను రెండు ముఖ్యమైన మ్యాచ్‌లు ఆడాడు. కానీ ఏమీ చేయలేదు. చాహల్ కూడా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు.’ అని అన్నాడు. భువనేశ్వర్ కుమార్ అత్యుత్తమ ప్రదర్శన చేయడం కష్టమని మంజ్రేకర్ అన్నాడు. అయితే దీపక్ చాహర్‌ను మాత్రం మంజ్రేకర్ ప్రశంసించాడు.

Read Also.. IPL-2022: ఐపీఎల్-2022లో పాల్గొనబోయే లక్నో జట్టు పేరు ఖరారైంది.. ఏం పేరు పెట్టారో తెలుసా..