Anjali Tendulkar: గోల్డ్ మెడల్ పట్టేసిన సచిన్ వైఫ్ అంజలి.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా?

|

Sep 06, 2024 | 8:42 AM

Sachin Tendulkar Wife Anjali Tendulkar Life Journey: భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆయనకు అభిమానం ఏమాత్రం తగ్గలేదు. సచిన్ టెండూల్కర్‌కు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనదైన గుర్తింపు ఉంది. క్రికెట్ దేవుడుగా పేరుగాంచాడు. భారత జట్టుకు ఎన్నో చారిత్రాత్మక విజయాలు అందించాడు.

Anjali Tendulkar: గోల్డ్ మెడల్ పట్టేసిన సచిన్ వైఫ్ అంజలి.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
Sachin Tendulkar Wife Anjal
Follow us on

Sachin Tendulkar Wife Anjali Tendulkar Life Journey: భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆయనకు అభిమానం ఏమాత్రం తగ్గలేదు. సచిన్ టెండూల్కర్‌కు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనదైన గుర్తింపు ఉంది. క్రికెట్ దేవుడుగా పేరుగాంచాడు. భారత జట్టుకు ఎన్నో చారిత్రాత్మక విజయాలు అందించాడు.

సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే, ఆయన కుమార్తె సారా టెండూల్కర్ ప్రస్తుతం సోషల్ మీడియాను శాసిస్తుంది. సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయింది. కొడుకు అర్జున్ టెండూల్కర్ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాడు. కాగా, సచిన్ టెండూల్కర్ భార్య అంజలి టెండూల్కర్ తన కెరీర్‌లో గోల్డ్ మెడలిస్ట్ సాధించిందని మీకు తెలుసా? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

అంజలి టెండూల్కర్‌కు గోల్డ్ మెడల్..

సచిన్ టెండూల్కర్ భార్య అంజలి టెండూల్కర్ 10 నవంబర్ 1967న ముంబైలో జన్మించింది. ఆమె తండ్రి పేరు ఆనంద్ మెహతా. అతను పెద్ద పారిశ్రామికవేత్త. అంజలి టెండూల్కర్ తల్లి అన్నాబెల్ మెహతా బ్రిటిష్ మూలానికి చెందినవారు. అంజలి టెండూల్కర్ తన తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె. అంజలి బాల్యం సరిగ్గా యువరాణిలా గడిచింది.

ఇవి కూడా చదవండి

అంజలి టెండూల్కర్ విద్యాభ్యాసం గురించి మాట్లాడితే, ఆమె బాంబే ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత గ్రాంట్ మెడికల్ కాలేజీ, సర్ JJ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, ముంబై నుంచి MBBS డిగ్రీని పొందింది. ముంబై యూనివర్సిటీలో పీడియాట్రిక్స్‌లో అంజలి టెండూల్కర్‌కు గోల్డ్ మెడల్ లభించింది.

పిల్లల పెంపకం కోసం వృత్తిని వదులుకున్న అంజలి..

పెళ్లి తర్వాత ఆమె తన కుమార్తె సారా, కొడుకు అర్జున్ మంచి ఎదుగుదల కోసం కెరీర్ కంటే కుటుంబాన్ని ఎంచుకుంది. కుటుంబం కోసం చాలా కాలం కేటాయించిన తర్వాత, అంజలి టెండూల్కర్ 2019 లో డాక్టర్‌గా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె UK, ముంబైలోని సియోన్ హాస్పిటల్ రెండింటిలోనూ పనిచేస్తోంది.

ప్రేమకథ ఎలా మొదలైందంటే?

సచిన్ టెండూల్కర్, అంజలిల ప్రేమ మొదటి చూపులోనే మొదలైంది. వీరిద్దరూ 1990లో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో మొదటిసారి కలుసుకున్నారు. సచిన్ టెండూల్కర్‌ను కలిసినప్పుడు అంజలి తన తల్లికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి చేరుకుంది. సచిన్ టెండూల్కర్‌ని చూడగానే అంజలి అతనితో ప్రేమలో పడింది. కొన్నేళ్ల తర్వాత 1995లో సచిన్ టెండూల్కర్, అంజలి టెండూల్కర్ పెళ్లి చేసుకున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే సచిన్ టెండూల్కర్ పెళ్లి చేసుకునే నాటికి అతడి వయసు 22 ఏళ్లు మాత్రమే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..