RCB vs DC: టాస్ గెలిచి స్మృతి మంధాన.. రెండు జట్ల ప్లేయింగ్-11 ఇదే.. బెంగళూరు రాత మార్చేనా?
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో తొలి డబుల్ హెడర్ ఈరోజు జరగనుంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తొలి మ్యాచ్ ప్రారంభమైంది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో తొలి డబుల్ హెడర్ ఈరోజు జరగనుంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తొలి మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు మెగ్ లానింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.
రాత్రి 7:30 గంటలకు డీవై పాటిల్ స్టేడియంలో యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య రెండో మ్యాచ్ జరగనుంది.
రెండు జట్ల ప్లేయింగ్-11 ఇదే..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), దిశా కసత్, సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, హీథర్ నైట్, రిచా ఘోష్, కనికా అహుజా, ఆశా శోభన, ప్రీతీ బోస్, మేగన్ షుట్, రేణుకా సింగ్.
ఢిల్లీ క్యాపిటల్స్: మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, ఎల్లీస్ క్యాప్సే, జెమిమా రోడ్రిగ్స్, మరియన్ కాప్, తానియా భాటియా, రాధా యాదవ్, శిఖా పాండే, జెస్ జోనాసెన్, అరుంధతీ రెడ్డి, తారా నోరిస్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..