
Royal Challengers Bangalore New Captain: ఐపీఎల్ 2025 ప్రారంభం కావడానికి ఇంకా సమయం ఉంది. అయితే, అన్ని జట్లు తమ సన్నాహాలను ప్రారంభించాయి. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో లేని ఆటగాళ్లు ఐపీఎల్ కోసం సన్నద్ధం కావడం ప్రారంభించారు. ఆర్‌సీబీ జట్టు కూడా ఇప్పటి నుంచే ఐపీఎల్‌కు సిద్ధమవుతోంది. అయితే, ఆర్‌సీబీ ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రశ్న కెప్టెన్సీ. ఆ జట్టు ఫాఫ్ డు ప్లెసిస్‌ను విడుదల చేసింది. ఆ తరువాత అతన్ని వేలంలో కూడా కొనుగోలు చేయలేదు. ఇప్పుడు ఆర్‌సీబీ కొత్త సీజన్ కోసం కొత్త కెప్టెన్‌ను నియమించాల్సి ఉంటుంది.
ఐపీఎల్ వేలానికి ముందు, ఆర్‌సీబీ ఫాఫ్ డు ప్లెసిస్‌ను తిరిగి తన జట్టులోకి తీసుకుంటుందని భావించారు. కానీ, అది జరగలేదు. వేలం సమయంలో ఆ జట్టు డు ప్లెసిస్‌ను వదులుకుంది. ఇది కాకుండా ఆర్‌సీబీ కెప్టెన్ అవుతాడని భావించే ఏ ఆటగాడిని కూడా వేలంలో ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఈ కారణంగా ఆర్‌సీబీ కెప్టెన్సీ గురించి సస్పెన్స్ ఉంది. అయితే, రాయల్ ఛాంలెంజర్స్ బెంగళూరు జట్టు సీవోవో రాజేష్ మీనన్ కొన్ని రోజుల క్రితం ఆర్‌సీబీలో చాలా మంది నాయకులు ఉన్నారంటూ ఒక ప్రకటన చేశారు. ఆర్‌సీబీలో దాదాపు 5గురు కెప్టెన్లు ఉన్నారని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం అంటూ ప్రకటించారు.
🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨
The wait is almost over! ⏳
RCB Men’s Team Captain announcement tomorrow at 11:30 AM for the upcoming IPL season ❤️🏆#RCB #IPL2025 #AndyFlower #Sportskeeda pic.twitter.com/UGX0WvdyDh
— Sportskeeda (@Sportskeeda) February 12, 2025
అదే సమయంలో, ఇప్పుడు ఆర్‌సీబీ కెప్టెన్సీకి సంబంధించి ఒక కీలక అప్‌డేట్ వచ్చింది. ఆర్‌సీబీ తన కొత్త కెప్టెన్‌ను ప్రకటించే తేదీ వెల్లడైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త కెప్టెన్‌ను ఫిబ్రవరి 13 గురువారం ఉదయం 11:30 గంటలకు ప్రకటిస్తారని తెలిపింది. ఇది స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారం అవుతుంది. అంటే, మరికొద్ది గంటల్లో అభిమానులు ఆర్‌సీబీ కొత్త కెప్టెన్ పేరు తెలియనుంది.
ఆర్‌సీబీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని గెలవలేదు. బెంగళూరు జట్టు మూడుసార్లు ఫైనల్స్‌కు చేరుకున్నప్పటికీ ఛాంపియన్‌గా నిలవలేకపోయింది. అయినప్పటికీ, అన్ని జట్ల కంటే ఆర్‌సీబీకే అత్యధిక అభిమానులు ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్‌లో ఏ జట్టుకైనా ఎక్కువ మద్దతు లభిస్తే అది ఆర్‌సిబియే. ఇప్పుడు జట్టు తదుపరి కెప్టెన్‌గా ఎవరిని నియమిస్తారో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..