AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SA vs WI: 2,6,4,6,6,2.. ఒకే ఓవర్‌లో 26 రన్స్‌.. 200 స్ట్రైక్‌ రేట్‌తో స్టార్‌ బౌలర్లకు దడ పుట్టించిన బ్యాటర్‌

19 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్‌ స్కోరు 194 పరుగులు మాత్రమే. చివరి ఓవర్‌లో స్టార్‌ బౌలర్ కగిసో రబాడా బంతి తీసుకున్నాడు. దీంతో పెద్దగా పరుగులు రావనుకున్నారు. అయితే స్ట్రైక్‌ తీసుకున్న రొమారియో షెపర్డ్‌ పూనకం వచ్చినట్లుగా చెలరేగిపోయాడు. 2,6,4,6,6,2.. ఇలా పెను విధ్వంసం ..

SA vs WI: 2,6,4,6,6,2.. ఒకే ఓవర్‌లో 26 రన్స్‌.. 200 స్ట్రైక్‌ రేట్‌తో స్టార్‌ బౌలర్లకు దడ పుట్టించిన బ్యాటర్‌
West Indies Cricket
Basha Shek
|

Updated on: Mar 29, 2023 | 10:22 AM

Share

దక్షిణాఫ్రికాతో హోరాహోరీగా సాగిన మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను వెస్టిండీస్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మంగళవారం జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో కరీబియన్‌ జట్టు 7 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ నష్టానికి 220 పరుగులు చేసింది. బ్రాండన్‌ కింగ్‌ 25 బంతుల్లో 36, నికోలస్‌ పూరన్‌ 19 బంతుల్లో 41 పరుగులు చేశారు. చివర్లో రొమారియో షెపర్డ్‌ (22 బంతుల్లో 44 నాటౌట్‌), అల్జారీ జోసెఫ్‌ (9 బంతుల్లో 14) చెలరేగి జట్టుకు భారీ స్కోరు అందించారు. అయితే 19 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్‌ స్కోరు 194 పరుగులు మాత్రమే. చివరి ఓవర్‌లో స్టార్‌ బౌలర్ కగిసో రబాడా బంతి తీసుకున్నాడు. దీంతో పెద్దగా పరుగులు రావనుకున్నారు. అయితే స్ట్రైక్‌ తీసుకున్న రొమారియో షెపర్డ్‌ పూనకం వచ్చినట్లుగా చెలరేగిపోయాడు. 2,6,4,6,6,2.. ఇలా పెను విధ్వంసం సృష్టించాడు. రబాడాకు చుక్కలు చూపిస్తూ ఒకే ఓవర్‌లో 26 పరుగులు పిండుకున్నాడు. 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 213 పరుగులు మాత్రమే చేయగలిగింది. రీజా హెండ్రిక్స్‌(44 బంతుల్లో 83, 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సునామీ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఐడెన్‌ మార్ర్కమ్‌ (18 బంతుల్లో 35 నాటౌట్‌) రాణించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు.

ఆఖరి ఓవర్లో 26 పరుగులు అవసరమైన దశలో సౌతాఫ్రికా 17 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 7 పరుగుల తేడాతో విండీస్‌ విజయం సాధించింది. కరేబియన్‌ బౌలర్లలో అల్జారీ జోసెఫ్‌ ఐదు వికెట్లతో సఫారీలను కట్టడి చేశాడు. ఈ విజయంతో వెస్టిండీస్‌ 2-1 తేడాతో టి20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. సుమారు 8 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా గడ్డపై విండీస్‌ జట్టు టీ20 సిరీస్‌ను గెలవడం విశేషం. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా అల్జారీ జోసెఫ్‌ నిలవగా.. జాన్సన్‌ చార్లెస్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపికయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..