AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: వరుసగా 3 సార్లు డకౌట్‌.. కట్ చేస్తే.. కెప్టెన్‌గా స్కై.. రోహిత్ ఔట్.!

ఐపీఎల్ 2023 ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్. ప్రారంభ మ్యాచ్‌లకు ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ..

IPL 2023: వరుసగా 3 సార్లు డకౌట్‌.. కట్ చేస్తే.. కెప్టెన్‌గా స్కై.. రోహిత్ ఔట్.!
Surya Vs Rohit
Ravi Kiran
|

Updated on: Mar 29, 2023 | 8:25 AM

Share

ఐపీఎల్ 2023 ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్. ప్రారంభ మ్యాచ్‌లకు ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నాడు. అతడి స్థానంలో స్టాండ్ బై సారధిగా సూర్య కుమార్ యాదవ్ వ్యవహరించనున్నాడు. ఈ ఏడాదిలోని డబ్ల్యూటీసీ ఫైనల్, వన్డే ప్రపంచకప్ ఉన్న నేపధ్యంలో వర్క్ లోడ్, గాయాల బెడద నుంచి తప్పించుకునేందుకు రోహిత్ శర్మ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియాలో ఓ కథనం ప్రచురితమైంది. రోహిత్ శర్మ మ్యాచ్‌లు ఆడనప్పుడు డగౌట్‌లో కూర్చుని టీంను గైడ్‌ చేస్తాడని తెలుస్తోంది.

మరోవైపు టెస్టులు, వన్డేలు, టీ20ల్లో ఆడుతోన్న ఆటగాళ్ల వర్క్ లోడ్‌ను టీం మేనేజ్‌మెంట్ పరిశీలిస్తుందని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మెగా టోర్నీల్లో ఆడే ఆటగాళ్ల వర్క్ లోడ్‌ను ఆయా ఫ్రాంచైజీలు సమన్వయం చేయాలని సూచించింది. దీంతో ఇతర ఆటగాళ్లకు స్పూర్తిగా నిలిచేందుకు మొదటిగా రోహిత్ శర్మే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

టోర్నీలో దాదాపు 5 నుంచి 7 మ్యాచ్‌లకు అతడు దూరమయ్యే అవకాశాలున్నట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి. ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుంది. కాగా, ఐపీఎల్ టోర్నీ ముగిసిన వారం రోజుల్లోనే టీమిండియా.. ఇంగ్లాండ్ వేదికగా ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే. అలాగే అక్టోబర్‌లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది.

ఇప్పటికే గాయాల బెడద కారణంగా పలు కీలక ఆటగాళ్లు ఈ రెండు మెగా ఈవెంట్స్‌కు దూరంగా కాగా.. ఇంకెవ్వరూ కూడా గాయపడకుండా ఉండేలా బీసీసీఐ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.