AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma : అవమానాలకు పరుగులే సమాధానం.. 44 బంతుల్లో 84.. రోహిత్ క్లాస్ ఇన్నింగ్స్ హైలైట్స్ ఇవే

Rohit Sharma : గాయం తర్వాత అదిరిపోయే రీతిలో రోహిత్ శర్మ రీఎంట్రీ ఇచ్చాడు. లక్నో సూపర్ జెయింట్స్‌పై 44 బంతుల్లో 84 పరుగులు చేసి, ముంబై ఇండియన్స్‌కు కీలక విజయాన్ని అందించాడు. రోహిత్ మైదానంలోకి అడుగుపెట్టగానే వాంఖడే స్టేడియం చప్పట్లతో మార్మోగిపోయింది.

Rohit Sharma : అవమానాలకు పరుగులే సమాధానం.. 44 బంతుల్లో 84.. రోహిత్ క్లాస్ ఇన్నింగ్స్ హైలైట్స్ ఇవే
Rohit Sharma
Rakesh
|

Updated on: May 05, 2026 | 9:17 AM

Share

Rohit Sharma : ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ తన విశ్వరూపాన్ని చూపించాడు. గాయం కారణంగా గత మూడు వారాలుగా మైదానానికి దూరంగా ఉన్న హిట్‌మ్యాన్, లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరోచిత ఇన్నింగ్స్‌తో అదిరిపోయే విధంగా రీఎంట్రీ ఇచ్చాడు. వయస్సు మీద పడినా, కెప్టెన్సీ కోల్పోయినా.. తనలోని కసి, పరుగుల దాహం అస్సలు తగ్గలేదని వాంఖడే సాక్షిగా నిరూపించాడు. హామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా గత 21 రోజులుగా రోహిత్ శర్మ మైదానానికి దూరమయ్యాడు. అభిమానులు ఆయన కోసం వేయికళ్లతో ఎదురుచూశారు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా రోహిత్ మైదానంలోకి అడుగుపెట్టగానే వాంఖడే స్టేడియం చప్పట్లతో మార్మోగిపోయింది. తొలుత కాస్త నిదానంగా (15 బంతుల్లో 15 పరుగులు) ఆడినప్పటికీ, పిచ్‌పై పట్టు చిక్కాక రోహిత్ అసలు సిసలైన బ్యాటింగ్‌ను రుచి చూపించాడు. కేవలం 44 బంతుల్లోనే 84 పరుగులు బాది, ముంబైకి భారీ విజయాన్ని అందించాడు.

కసి తీర్చుకున్న హిట్‌మ్యాన్

ఈ సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ యాజమాన్యం రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించి హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించడం పెద్ద వివాదానికి దారితీసింది. అయితే రోహిత్ మాత్రం ఎక్కడా నోరు జారకుండా, తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. ఈ సీజన్ కోసం ఏకంగా 15 కిలోల బరువు తగ్గి, మరింత లీన్‌గా, మీన్‌గా తయారయ్యాడు. తనను తక్కువ అంచనా వేసిన వారికి తన బ్యాట్‌తోనే సమాధానం చెబుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఆడిన అతి తక్కువ మ్యాచ్‌ల్లోనే 221 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు.

ముంబై ఇండియన్స్ అంచనాలు తారుమారు

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే 78 పరుగులు చేసిన రోహిత్, ఆ తర్వాత గాయం బారిన పడటం జట్టును దెబ్బతీసింది. ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం 3 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో వెనుకబడి ఉంది. స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ జట్టు ఫెయిల్ అవుతుండటంపై విమర్శలు వస్తున్నాయి. కానీ, రోహిత్ రీఎంట్రీ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ విజయంతో ముంబై ప్లే ఆఫ్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.

రిటైర్మెంట్ ముచ్చటే లేదు

రోహిత్ శర్మ ఇప్పటికే అంతర్జాతీయ టీ20లు, టెస్టుల నుంచి తప్పుకున్నాడు. కేవలం వన్డేలు, ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఆయన త్వరలోనే క్రికెట్‌కు గుడ్ బై చెబుతాడని వస్తున్న వార్తలకు ఈ 84 పరుగుల ఇన్నింగ్స్‌తో చెక్ పెట్టాడు. రోహిత్ ఇంకా ఫిట్‌గా ఉన్నాడని, బంతిని బాదడంలో తన పవర్‌ ఏమాత్రం తగ్గలేదని ఈ మ్యాచ్ నిరూపించింది. ముంబై ఇండియన్స్‌కు 5 టైటిళ్లు అందించిన ఈ లెజెండరీ ప్లేయర్, త్వరలో రిటైర్ అవుతారనే ఊహాగానాలను తుడిచిపెట్టేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us